Huge Rush for Fish On Occasion Of Mrigasira Karthi మృగశిర కార్తే: మరింతగా పెరిగిన చేపల డిమాండ్.. ధరలతో షాక్.!

Mrigasira karthi fish sales increased know why people eat fish

Mrigasira Karthi, Fish sales, High demand, fish prices shoot-up, Huge crowds in fish market, non-veg lovers prefer fish, significance of fish, Telangana

Huge crowds were witnessed at fish markets today in view of the Mrigasira Karthi. Most of non-veg lovers believe that eating fish is a must on the day of Mrigasira Karthi. It remained a tradition of eating fish and almost 70 to 80 percent of the households eat fish on the auspicious day.

మృగశిర కార్తే: మరింతగా పెరిగిన చేపల డిమాండ్.. ధరలతో షాక్.!

Posted: 06/08/2022 12:56 PM IST
Mrigasira karthi fish sales increased know why people eat fish

మృగశిర కార్తి ప్రవేశించగానే చేపల ధరలకు రెక్కలు వచ్చాయి. మృగశిర కార్తె ప్రవేశించిన నేపథ్యంలో అటు ఇటుగా ఆ వారం రోజుల పాటు చేపలు తినడంతో..అవి రుతుపవనాలతో వచ్చే శ్వాసకోశ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందన్న నమ్మకం తెలంగాణ ప్రజల్లో చాలా బలంగా ఉంది. దీంతో ఈ వారం రోజుల పాటు చేపలు తినేలేని వారు కనీసం మృగశిర కార్తె రోజునైనా చేపలు తింటే మంచిదని భావిస్తుంటారు. దీంతో ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసిన చేపల దుకాణాల వద్ద జనం కిటకిటలాడుతున్నారు. హైదరాబాదులోనే అత్యంత పెద్ద చేపట మార్కుట్ ఉన్న రామ్ నగర్ లోనూ కొనుగోలుదారులు తాకిడి విపరీతంగా పెరిగింది.

ఇక గత రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి ఆంక్షల నేపథ్యంలో ప్రజలు మృగశిర కార్తె(మిర్గం)ను కూడా పెద్దగా పట్టించుకోలేదు. చేపల నుంచి కూడా కరోనా సోకుతుందన్న భయాందోళనల మధ్య ఎందుకోచ్చిన గొడవ అన్నట్లు మిన్నకుండిపోయారు. దీంతో ఈ సారి మిర్గం రావడంతోనే తప్పనిసరిగా చేపలు తినాలిని ఫిక్స్ అయ్యారు. ఇక  మిర్గం రోజులు రాహు, కట్ల చేపలు తింటే మంచిదని కూడా పెద్దల నుంచి వచ్చినందున ఈ చేపలకు కూడా డిమాండ్ బాగా పెరగింది. ఇక చేపల కోసం ప్రజలు క్యూకట్టడంతో వ్యాపారులు చేపల ధరలకు రెక్కలను అద్దారు.

సాధారణ రోజుల్లో రాహు, కట్ల చేపలు 110 నుంచి 130 మధ్య ధర పలికితే.. మిర్గం రోజున ఏకంగా 200 నుంచి 300 మధ్య ధరను పెంచి సోమ్ముచేసుకుంటున్నారు. నగరంలోకి చేపలు అదిలాబాద్, సూర్యాపేట, జనగాం, కరీంనగర్, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డీల నుంచి అధికంగా వస్తుంటుంది. ఇక దీనికి తోడు ఈ మధ్యకాలంలో సముద్ర చేపలను కూడా నగరానికి సజీవంగా తరలిస్తున్నారు. ఇక చేపలు హృద్రోగులకు చాలా మంచివని చెప్పడంతో పాటు పలు రకాలుగా వీటిని ఆరగించడం మంచిదని చెప్పడంతో వాటికి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మిర్గం వారికి కలిసిరావడంతో చేపలు కోనడానికి ప్రజలు పోటీ పడ్డారు.

రోహిణి కార్తెలో ఎండలతో అల్లాడిపోయిన జనం మృగశిర కార్తె రాకతో వాతావరణం చల్లబడుతుందని ఆశిస్తున్నారు. చల్లబడిన వాతావరణంలో శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గకుండా చేపలు తింటారు. మృగశిర కార్తె తొలిరోజే చేపలు తింటే ఒంట్లో వేడి పెరిగి ఏడాదంతా ఆరోగ్యంగా ఉంచారని నమ్మకం.మార్కెట్లో డిమాండ్​ను గమనించిన వ్యాపారులు బొచ్చె, రవ్వట, వాలుగు, పరం రూ.200 వరకు ధరలు పెంచి అమ్మారు. కొర్రమీను అయితే.. ఏకంగా రూ. 400 నుంచి 700 పెంచి అమ్మారు. ధరలు పెంచినా.. మాంసప్రియులు లెక్కచేయకుండా కొనడం కనిపించింది. మృగశిర కార్తి నాడు చేపలే కాకుండా బెల్లం, ఇంగువ కలిపి తింటారు. ఇలా తింటే ఉబ్బసం రాదని నమ్ముతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles