బావ, బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు.. అన్నది పాతకాలం నాటి నానుడి. ఆ తరువాత బావలకు సముచిత గౌరవం కలిగేంచే రోజులు వచ్చాయి. అయితే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు.. మళ్లీ బావలను తన్నే రోజులు వచ్చాశాయి. గతంలో ఏం జరిగిందోనన్న సంగతి మాకు తెలియదు కానీ.. మా కాలంలో అంతర్జాలం తీవ్ర ప్రభావం చూపుతుంది. అందులో ఏ ఒక్కరైనా.. చెడుగా పడ్డారా..? ఇక బయటకు వచ్చేందుకు చాలా ప్రయాపపడాల్సిందే. అలాంటి ఘటనే ఇది. ఇక్కడ తన సోదరి వివాహం జరుగుతోంది. పరణయంలో వరమాల ఘట్టం వచ్చింది.
ఆ ఘట్టంలో భాగంగా వరుడిపై పూలు, అక్షింతలు వేస్తున్న మరదలు.. తన సోదరి మెడలో బావ వరమాల వేస్తాడని.. అలా పక్కుకు జరిగింది అంతే.. అమె మెడలో వరమాల పడింది. పక్కనే తనకు కాబోయే భార్యను పెట్టుకుని.. మరదలి మెడలో వరమాల వేయడంతో పెళ్లికి వచ్చిన అతిధులు, బంధువులు, అటు వధూవరులకు చెందిన కుటుంబ సభ్యులు అందరూ షాక్ తిన్నారు. అయితే అందరికంటే ముందుగా ఈషాక్ నుంచి తేరుకున్న మరదలు మాత్రం బావకు బాగానే వడ్డన చేసింది. ఎంతలా అంటే మత్తు సామ్రాజ్యంలో మునిగితేలుతున్న బావ.. ఒక్కసారిగా ఏం జరిగిందీ అనే స్థాయికి పెళ్లి వేదికపైనే వడ్డించేసింది.
ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగిందని.. అయితే ఎక్కడ.. ఏమిటీ అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇక ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్న వివరాలు కూడా అందుబాటు లేవు. అయితే పురుషాధిక్య సమాజంలో భార్య అనే స్థానానికి సమాజం ఇచ్చిన గౌరవం ఎలాంటిదో.. ఇక్కడ ఈ ఘటనలో వధువు ప్రదర్శించడం గమనార్హం. తన చెల్లి తనకు కాబోయే భర్తపై చేయిచేసుకుంటుంటే.. అమె మా్త్రం తన సోదరి చర్యను తప్పుబట్టింది. తన భర్త మందు తాగడం వల్ల.. తెలియక నీ మెడలో వరమాలవేసాడే కానీ.. కావాలని కాదుగా.. అందుకు అలా దాడి చేస్తావా అని ప్రశ్నించింది. ఇలా భార్యలు భర్తలను వెనుకేసుకోచ్చినన్ని రోజులు.. ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్ని చూడాల్సివస్తుందో.. ఇంతకీ అసలు సంగతేమిటీ అంటే..
बिहार में शराबबंदी बा .pic.twitter.com/MiWYfF2N2T
— Vikki1975 (@Vikki19751) June 21, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more