భిన్నత్వంలో ఏకత్వం చాటే దేశం మనది. ఎన్నో కులాలు, మరెన్నో మతాలు.. అనేక ప్రాంతాలు.. ప్రతీ కులానికో ఆచారం. ఒక్కో మతానికి ఒక్కో విధానం. ప్రాంతానికో సంప్రదాయం.. అన్నింటినీ మేళవించినదే భారతీయ సంస్కృతి. అయితే తాము భారతీయులం అన్న విషయాన్ని మర్చిపోతున్న పలువురు కేవలం రాజకీయ నాయకులు ప్రసంగాలకు, మత పెద్దల ప్రబోధాలకు ప్రభావితమై ఇన్నాళ్లు.. భాయ్ భాయ్ అంటూ కలిసిఉన్న విషయాన్ని మర్చిపోయి.. మరీ కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తున్నారు. తమ మతం గురించి మంచి చెప్పుకోవడంలో ఏ మాత్రం తప్పులేదు కానీ.. పరమతాన్ని తక్కువ చేయడం అనర్థాలకు, అపార్థాలకు దారితీస్తోంది.
ఫలితంగా నిన్నమన్నటి వరకు కలసివున్నావాళ్లనే వేరుగా చూడటం.. వారి దేవతామూర్తులు ముద్రించిన పేపర్లను కించపర్చేలా మాంసాహారాన్ని అందులో ఫ్యాక్ చేయడం లాంటి ఘటనలు నమోదవుతున్నాయి. పరమత దేవుళ్ల పట్ల ద్వేష భావం, చులకన భావం పెరిగిపోతున్న తీరు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తోంది. ఇందుకు సంబంధించి పలు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మహమ్మద్ ప్రవక్త గురించి బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాజస్థాన్, మహారాష్ట్రలో హిందువుల తలలు తెగనరకడం, కాళికా మాత నోట్లో సిగరెట్ తో పోస్టర్ ను ముద్రించడం వంటి ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. ఫలితంగా దేశంలో ఇవి అశాంతిని రాజేస్తున్నాయి.
తాజాగా యూపీలోని సంభాల్ లో ఓ ముస్లిం వ్యాపారి హిందూ దేవతల చిత్రాలున్న పేపర్లలో చికెన్ ప్యాక్ చేసి విక్రయిస్తున్న తీరు వెలుగులోకి వచ్చింది. తాలీబ్ హుస్సేన్ అనే వ్యాపారి హిందూ దేవత, దేవుడి చిత్రాలున్న పేపర్లలో చికెన్ ప్యాక్ చేసి విక్రయిస్తున్నాడని, మత మనోభావాలను గాయపరుస్తున్నాడంటూ కొంత మంది ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు తాలీబ్ హుస్సేన్ షాపులో తనిఖీకి వెళ్లగా.. కత్తితో పోలీసులపైకి అతడు దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు మతాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడంటూ సెక్షన్ 153-ఏ, సెక్షన్ 295ఏ, సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more