తెలంగాణలో వరుణుడి బీభత్సం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే చెరువులు, నదులు, వాగులు, వంకలు పొంగిపోర్లతున్నాయి. వరుణుడి ధాటికి జూలై నేలాఖరులో లేదా సెప్టెంబర్ మాసంలో నిండుకుండలను తలపించాల్సిన జలాశయాలు జూలై రెండో వారంలోనే రమారమి చేరుకోవడంతో.. దిగువకు నీటిని వదులుతున్న పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇంతలా రాష్ట్రంపై వరుణుడు కరుణించాడు. అయితే ఈ వరుణుడి ధాటికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్థంభించింది. పలు ప్రాంతాలకు రవాణా సౌకర్యం కూడా అందకుండాపోయింది.
ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరిగింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 14 వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
ఇక రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నదిలోకి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద అంతకంతకూ నీటిమట్టం పెరుగుతున్నది. ఉదయం 9 గంటల సమయంలో 49 అడుగులు దాటిన వరద ఉధృతి ఇప్పుడు 50.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు చివరి ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు.
వందేండ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో గోదావరికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి.. 9 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నానికి 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరిలో గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. వరద ఉధృతి కారణంగా పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం 32.2 మీటర్లకు చేరుకుంది. గంటకు 35 సెం.మీ. చొప్పున గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.
హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద కొనసాగుతోంది. గత నాలుగైదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఉస్మాన్ సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో 300 క్యూసెక్కులుగా ఉన్న కారణంగా.. 2 గేట్లు ఎత్తి 208 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1,786 అడుగులు. హిమాయత్ సాగర్ 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 686 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత 1760.55 అడుగులకు నీరు చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more