పిల్లల విద్యావిధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడంతా టెక్నాలజీ చదువులు వచ్చేశాయి. దానికి తోడు కరోనా కారణంగా విద్యార్థులు.. బడులకు నెలల పాటు బడులకు దూరమయ్యారు. కొత్తగా స్కూల్స్ ప్రారంభం కావడంతో విద్యార్థులు చదువులో బాగా వెనకబడ్డారు. దండిస్తే.. పిల్లలు క్రమశిక్షణ తప్పరు, సరిగా చదువుతారనేది ఒకప్పడు ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. అయితే పిల్లల్ని దండించడంలో ఓ టీచర్ దారుణంగా వ్యవహరించింది. ఆమెకు కూడా ఓ తల్లేనన్న విషయం మరచి.. పాపం పసిపాపను చితకబాదింది.
ఐదేళ్ల చిన్నారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ దారుణఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉన్నావ్ జిల్లా అసోహా మండలం ఇస్లామ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో శిక్షా మిత్ర లేదా పారా టీచర్.. ఓ చిన్నారిని దారుణంగా కొట్టింది. క్లాస్ రూమ్ శబ్ధం చేసిందని, హోం వర్క్ చేయలేదన్న కారణంతో 30 సెకన్లలో 10 చెంప దెబ్బలు కొట్టింది. చిన్నారి జుట్టు పట్టుకుని ఎడా పెడా చెంపలు వాయించింది. ఈ క్రమంలో చిన్నారి బోరున ఏడుస్తున్నా.. ఆమె అదేదీ పట్టించుకోలేదు.
ఈ ఘటన ఈనెల 9వ తేదీన చోటుచేసుకోగా.. అదే రోజు సాయంత్రం బాలిక తల్లిదండ్రులు చిన్నారి ముఖంపై దెబ్బలు గుర్తించి.. వెంటనే బడికి వచ్చారు. అనంతరం టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి మరోసారి ఇలా జరిగితే బాగుండని హెచ్చరించారు. ఈ క్రమంలోనే మళ్లీ ఇలాంటి పని చేయనని ఆమెతో లేఖ రాయించారు. అయితే.. ఓ వ్యక్తి ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ కాగా.. విద్యాశాఖ అధికారులు స్పందించారు. టీచర్‌ను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు.
Accused #teacher (Shiksha Mitra) Sunil Kumari suspended for brutally assaulting a minor girl in govt primary school of Unnao (Islamnagar of Asoha block).#UttarPradesh #Student pic.twitter.com/ptemz5KSkN
— Arvind Chauhan अरविंद चौहान (@ArvindcTOI) July 12, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more