బీజేపీ ఎమ్మెల్యేపై స్థానిక మహిళలు బురద చల్లారు. అదేంటీ ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో స్థానిక ప్రజల బలంతో గెలిచిన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపి ఎమ్మెల్యేకు అంతలోనే ఇంతటి వ్యతిరేకమా.? అని అనుకుంటున్నారా..? అయితే మీరూ బురదలో కాలేసినట్లే. మరైతే ఎమ్మెల్యేపై మహిళలు బురదజల్లడం దేనికి.? అంటరా.? అదే అక్కడి ఆనవాయితీ. అదే అనవాయితీ అంటే.. వర్షాలు పడాలంటే ఇలా చేయడం అక్కడి ప్రజల అనవాయితీ. దీంతో బకెట్లతో బురద నీళ్లను తలపై గుమ్మరించారు.
బురద నీళ్లతో తల స్నానం చేయించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పిపర్‌డ్యూరా ప్రాంతానికి చెందిన మహిళలు వాన దేవుడి ప్రసన్నం కోసం పురాతన ఆచారాన్ని పాటిస్తుంటారు. ఇందులో భాగంగా స్థానిక పాలకులకు బురద నీళ్లతో తల స్నానం చేయించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ ప్రాంత మహిళలు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా, కార్పొరేషన్ చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్‌ల తలపై బురద నీళ్లు గుమ్మరించి మట్టి స్నానం చేయించారు.
ఈ సందర్భంగా మహిళలు తమ సంప్రదాయ పాటలు పాడారు. కాగా, పిల్లలు, పెద్దలు బురద నీటితో తల స్నానం చేయడం వల్ల వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని ఈ ప్రాంత మహిళల నమ్మకమని బీజేపీ ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా, కార్పొరేషన్ చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్ తెలిపారు. పురాతన సంప్రదాయమైన ఈ బురద స్నానంలో తాము పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Women in Pipardeura area of Maharajganj in Uttar Pradesh throw mud at MLA believing this will bring a good spell of rainfall for the season pic.twitter.com/BMFLHDgYxb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 13, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more