ఉచిత హామీలతో దేశాభివృద్ధి కుంటుపడుతుందని ఇలాంటి వాటిని ఉత్తరాది స్వీట్ రెవ్దితో పోల్చిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీటుగా స్పందించారు. ఉచిత విద్య, వైద్యం తాయిలాలు కాదని స్పష్టం చేశారు. ఢిల్లీలోని 18 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వారికి ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నానని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
వారికి ఉచిత విద్య అందించడం తాను చేసిన నేరమా అని ఆప్ చీఫ్ నిలదీశారు. 1947, 1950 ప్రాంతాల్లోనే ఇవన్నీ చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. దేశ పురోభివృద్ధికి మనం పునాది వేస్తున్నామని, ఇవేమీ ఉచిత తాయిలాలు కాదని తేల్చిచెప్పారు. తనను విమర్శిస్తున్నవారు తమ కోసం ఏకంగా విమానాలు, ప్రైవేట్ జెట్లు కొనుగోలు చేసేందుకు వేలాది కోట్లు వెచ్చిస్తున్నారని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.
కేజ్రీవాల్ తన కోసం విమానాలు కొనుగోలు చేయలేదని, ఢిల్లీలో తాను పలు ఉచిత పధకాలు అమలు చేస్తున్నా తమ బడ్జెట్ లాభాల బాటలో ఉందని పేర్కొన్నారు. తాను ఈ విషయం చెప్పడం లేదని కాగ్ తాజా నివేదికే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాగా యూపీలో బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉచిత హామీలు దేశ అభివృద్ధికి విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత ఇలాంటి హామీల వలలో పడవద్దని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more