ఇంద్ర ధనుస్సులా మెరిసిపోతూ పైనున్న ఈ ఫోటోలో కనిపిస్తున్నది మన భూగ్రహంలా అనిపిస్తోందా..? అయితే మీరు పొరబడ్డట్టే. అది సౌర కుటుంబంలో చివరన ఉన్న ప్లూటో గ్రహం. మొదట్లో సౌర కుటుంబంలోని 9 గ్రహాల్లో ఒకటిగా ఉన్న దీనిని కొన్నేళ్ల కిందత ఆ హోదా నుంచి తొలగించారు. ప్రస్తుతం ప్లూటోను మరుగుజ్జు గ్రహంగానే పిలుస్తున్నారు. దీనికి సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ చిత్రాన్ని పెట్టింది. దానితోపాటు ప్లూటో విశేషాలనూ పేర్కొంది.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గతంలో ప్రయోగించిన న్యూహారిజాన్స్ వ్యోమ నౌక ప్లూటోను దగ్గరి నుంచి స్పష్టంగా చిత్రీకరించింది. ప్లూటోపై ఉన్న వివిధ ప్రాంతాలు, లోయలు, పర్వతాలు, నున్నగా మంచుతో కూడిన మైదాన ప్రాంతాలను స్పష్టంగా ఫొటోలు తీసింది. ఆ వివరాలు మరింత స్పష్టంగా కనిపించేలా నాసా శాస్త్రవేత్తలు.. న్యూహారిజాన్స్ తీసిన చిత్రాన్ని రంగుల్లోకి మార్చారు. దీంతో అది కాస్తా ఇంధ్రదనస్సులా మెరిసిపోతూ.. అందరికీ కనువిందును చేస్తోంది.
సౌర కుటుంబంలోని మిగతా గ్రహాలు, గ్రహ శకలాలను పరిశీలించేందుకు నాసా 2006లో న్యూహారిజాన్స్ వ్యోమనౌకను ప్రయోగించింది.
అది వివిధ గ్రహాలను పరిశీలిస్తూ.. 2015లో ప్లూటోకు దగ్గరగా చేరింది.
సుమారు ఆరు నెలల పాటు ప్లూటోకు సమీపంగా ప్రయాణించిన న్యూహారిజాన్స్.. ఆ మరుగుజ్జు గ్రహానికి సంబంధించిన ఎన్నోచిత్రాలను మనకు అందించింది.
ఇన్ స్టాగ్రామ్ లో నాసా పెట్టిన ఈ ఫొటో, పోస్టుకు కేవలం ఒక రోజులోనే దాదాపు పది లక్షల దాకా లైక్ లు, వేలల్లో కామెంట్లు రావడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more