దేశంలో బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇక మరీ ముఖ్యంగా చేతిలో రూ.2 లక్షలకు మించిన నగదు ఉండరాదని.. నోట్ల రద్దు తరువాత ఆర్బీఐ తాజాగా అదేశాలు జారీ చేసిన నిబంధనతో చాలావరకు డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. అయినా.. బ్యాంకు ఖాతాదారులకు మాత్రం బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాల లావాదేవీలు జరపడంలో ఉన్న సంతోషమే వేరు. అరచేతిలో బ్యాంకు లావాదేవీలు జరుగుతున్నా.. ఇప్పటితరం యువత మినహాయిస్తే.. మిగిలిన కస్టమర్లు అందరూ బ్యాంకులకు వెళ్లేవాళ్లే. అదే వాళ్లకు సంతృప్తినిస్తుంది.
అయితే, మిగతా వారి మాదిరిగానే బ్యాంకు ఉద్యోగులకు సెలవులు ఉంటాయి. కనుక రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేవారికైతే.. సెలవులు ఎప్పుడు ఉన్నాయో తెలుస్తుంది. అలా కాకుండా అప్పుడప్పుడు బ్యాంకు శాఖలకు వెళ్లే వారికి పూర్తి వివరాలు తెలియవు. కనుక ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే లావాదేవీలు జరుపడం తేలికవుతుంది. కాగా ప్రతీ నెల రెండు, నాలుగు శనివారాలతో పాటు నాలుగు ఆదివారాలు బ్యాంకులు పనిచేయవన్న విషయం తెలిసిందే. ఇక వీటికి తోడు వచ్చే పండుగలు, ఇతర సెలవుల వివరాలు ఆగస్టు నెలలో ఇలా ఉన్నాయి.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇచ్చే సెలవులన్నింటినీ కలుపుకుంటే.. ఆగస్టు నెలలో మొత్తం 18 రోజులు బ్యాంకులు పని చేయవు. ఆగస్ట్ 11న రక్షాబంధన్ సందర్భంగా బ్యాంకులు సెలవు. నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు బ్యాంకులు పని చేయవు. ఆగస్టు 13 నుంచి 15 వరకు వరుసగా మూడు రోజులు బ్యాంకింగ్ లావాదేవీలు ఉండవు. 13న రెండో శనివారం, 14న ఆదివారం, 15న దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. కనుక బ్యాంకులకు వెళ్లే వారు వచ్చే నెలలో ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే తేలిగ్గా ఉంటుంది. ఆగస్ట్‌లో బ్యాంకులకు సెలవులు ఇలా..
తేదీ -- సెలవు కారణం -- ఏయే ప్రాంతాల్లో సెలవు
1 -- దృపక షీ-జీ పండుగ -- సిక్కిం
7 -- ఆదివారం
8 -- మొహరం -- జమ్ముకశ్మీర్
9 -- మొహరం -- పలు ప్రదేశాల్లో సెలవు
11 -- రక్షాబంధన్ -- అహ్మదాబాద్, భోపాల్, జైపూర్, సిమ్లా
12 -- రక్షాబంధన్ -- కాన్ఫూర్, లక్నో
13 -- రెండో శనివారం
14 -- ఆదివారం
15 -- స్వాతంత్య్ర దినోత్సవం
16 -- పార్శీ నూతన సంవత్సరాది -- నాగ్‌పూర్, ముంబై
18 -- జన్మాష్టమి -- భువనేశ్వర్, చెన్నై, కాన్పూర్, లక్నో
19 -- జన్మాష్టమి -- అహ్మదాబాద్, భోపాల్, చండీగఢ్, చెన్నై, గ్యాంగ్‌టక్, జైపూర్, జమ్ము, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్
20 -- శ్రీకృష్ణాష్టమి -- హైదరాబాద్
21 -- ఆదివారం
27 -- 4వ శనివారం
28 -- ఆదివారం
29 -- శ్రీమంత్ శంకర్‌దేవ్ జయంతి -- గువహాటి
31 -- గణేష్ చతుర్థి -- అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్, పనాజీ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more