ఉత్తర ప్రదేశ్‌లోని ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా జాతికి అంకితమిచ్చిన బుంధేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ హైవేపై చిన్నపాటి వర్షాలతో గొతులు ఏర్పడి కంకర తేలడంతో.. దాని నాణ్యతపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. రోడ్డు నాణ్యత విషయంలో లోపభూయిష్టంపై ఈడీ చేత దర్యాప్తు చేయించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. కాంట్రాక్టుపై ఆదాయ పన్ను శాఖ చేత దాడులు చేయించాలని ఇలా పలు రకాల విమర్శలు వినిపించాయి. అయితే ఈ రోడ్డు అంశాన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న తరుణంలో అదే ఉత్తర్ ప్రదేశ్ లోని మరో రోడ్డు ఈ అంశాన్ని మళ్లీ గుర్తుచేసింది.
అయితే తాజాగా నోయిడా నుంచి గ్రేటర్ నోయిడా మధ్య నిర్మించిన నోయిడా ఎక్స్‌ప్రెస్-వే పగుళ్లించింది. పదిహేను మీటర్ల పొడవు, రెండు అడుగుల వెడల్పు మేర పెద్ద గొయ్యి ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించింది. దీంతో స్థానికులు, వాహన యజమానులు తీవ్ర ఆందోళన చెందారు. ప్రతినిత్యం అత్యంత రద్దీగా ఉండే ఈ రహదారి.. ఇవాళ శనివారం కావడంతో కాసింత రద్దీ తక్కువగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ ను అధికారులు త్వరితగతిన క్లియర్ చేయగలిగారు. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ రహదారిశాఖ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగి.. ఆ మార్గంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అవాంతరం లేకుండా మరమ్మతులు చేశారు.
అయితే నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై తవ్వకం పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సెక్టార్ 96 వద్ద అండర్ పాస్ కోసం పనులు జరుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం పనులు మొదలయ్యాయని, దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని వివరించారు. కాగా, 27 కిలోమీటర్ల పొడవైన నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వే మీదుగా లక్షల్లో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. సెలవు రోజులైన శనివారం, ఆదివారం ఈ మార్గంలో ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. మరోవైపు అండర్ పాస్ పనుల వల్ల ఆ ఎక్స్‌ప్రెస్ వేపై ట్రాఫిక్ జామ్‌లు, అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. అయితే శనివారం పరిస్థితి మెరుగుపడిందని, ట్రాఫిక్ జామ్ తగ్గిందని వెల్లడించారు.
नोएडा-ग्रेटर नोएडा एक्सप्रेसवे पर हुआ 15 फीट लंबा गड्ढा, सेक्टर 96 के पास हुआ गड्ढा.#Noida pic.twitter.com/cGNbPxCmO0
— Saurabh Yadav (@Saurabh21Ydv) August 27, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more