ఉత్తరప్రదేశ్‌లోని ఈ ఆసుపత్రికి పిల్లులు కావాలంటే వెళ్తారు. వీరు చక్కగా పిల్లలను అందించడంలో సిద్దహస్తులు. అంటే పురటినోప్పులతో వచ్చే తల్లలకు ఉపశమనం కల్పించేలా చక్కటి హస్తవాసి గల వైద్యులు సర్జరీ అవసరం లేకుండానే కాన్పులు చేస్తారని అనుకుంటే పోరబాటే. ఉత్తర్ ప్రదేశ్ బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో, లేక పుణ్యక్షేత్రాల్లో తమ చంటిబిడ్డలను పక్కన బుట్టుకుని పడుకునే తల్లలను టార్గెట్ గా చేసుకుని వారి చంటిబిడ్డలను కిడ్నాప్ చేస్తి.. తమకు బిడ్డలు కావాలని తమను సంప్రదించే వ్యక్తులకు వీరిని విక్రయించి సోమ్ము చేసుకుంటారు.
ఏంటీ వైద్యులు ఈ పనులు చేస్తారా.? అన్న సందేహాలు అసవరమే లేదు. వీరు హాత్రాస్ లో ఓ అసుపత్రిని నడుపుతూ.. ఇలాంటి కార్యకాలాపాలకు దానిని అడ్డగా మార్చుకున్నారు. ఎవరికైనా బిడ్డలు కావాలంటే వీరు కిడ్నాప్ చేసి.. తమ వద్దకు వచ్చే క్లయింట్లకు విక్రయిస్తుంటారు. ఇంతకీ ఈ రాకెట్ లో ఎంతమంది వైద్యులు ఉన్నారు.? అనేగా మీ సందేహాం. ఇద్దరు మాత్రమే.. వారు కూడా భార్యభర్తలే. చంటిపిల్లలను కిడ్నాప్ చేయడం.. విక్రయించడమే వీరి ఆసుపత్రిలో జరిగే పని. ఇందుకోసం ఒక చిన్నపాటి ముఠానే వీరు ఏర్పాటు చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు.
తమ చెల్లిలి భర్త మరణానికి వెళ్లిన ఓ జంట అర్థరాత్రి దాటిన తరువాత మథుర రైల్వే జంక్షన్‌కు చేరుకుని అక్కడ ఓ ప్లాట్ ఫాంపై పడుకున్నారు. బాగా దు:ఖంలో మునిగిపోయి ఆలసిపోవడం.. అర్థరాత్రి ఫ్లాట్ ఫామ్ కు చేరుకోవడంతో వారికి బాగా నిద్రపట్టేసింది. తెల్లవారిజామున లేచి చూస్తూ తమ ఏడు నెలల బిడ్డ కనిపించలేదు. దీంతో వారు స్థానిక రైల్లే పోలీసులకు పిర్యాదు చేశారు. కాగా ఈ ఘటన ఈ నెల 24వ తేదీన తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగింది. ఈకేసును సీరియస్‌గా తీసుకున్న రైల్వే పోలీసులు.. మధుర సీఓటి పోలీసులు 200 సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, నిందితుడిని పట్టుకున్నారు.
కాగా, నిందితుడ్ని తమదైన శైలిలో విచారించిన తరువాత వైద్యుల కిడ్నాప్ రాకెట్ బయటపడింది. వీరికి సహకరించిన దీప్ కుమార్ శర్మ అనే వ్యక్తితో పాటు ఇద్దరు ఏఎన్ఎంల వివరాలు కూడా బయటపడ్డాయి. ఇక కిడ్నాప్ కు గురైన శిశువు ఫిరోజాబాద్‌లోని బీజేపీ కౌన్సిలర్ వినితా అగర్వాల్ కు విక్రయించినట్టు వారు తెలిపారు. దీంతో బీజేపి కౌన్సిలర్ ఇంటికి చేరుకున్న పోలీసులు వారి ఇంటి నుంచి బాధితురాలు రమాదేవి బిడ్డను గుర్తించారు. బిడ్డను స్వాధీనం చేసుకుని తల్లికి అప్పగించారు. కాగా బీజేపి కౌన్సిలర్ వినితా అగర్వాల్, అమె భర్త కృష్ణ మురారీ అగర్వాల్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే వినితా అగర్వాల్, భర్త కృష్ణ కలిసి ఫిరోజాబాద్‌లో ఉంటున్నారు. వీరికి 12 ఏండ్ల కుమార్తె ఉంది. కుమారుడు లేకపోవడంతో.. ఒక అబ్బాయిని దత్తత తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అది వీలు కాలేదు. ఎలాగైనా కుమారుడు కావాలన్న తపనతో ఓ ఆస్పత్రిని సంప్రదించగా, వారు మథుర స్టేషన్లో తల్లిదండ్రులతో నిద్రిస్తున్న బాలుడిని కిడ్నాప్ చేశారు. పసిబాబును కిడ్నాప్ చేసిన వ్యక్తిని దీపక్‌గా గుర్తించారు. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు డాక్టర్లతో పాటు దీపక్‌ను మరికొందరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాబు కావాలని కోరిన వినితా అగర్వాల్ నుంచి డాక్టర్లు రూ. 1.8 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ये व्यक्ति रे०स्टेशन मथुरा जं० से अपनी माँ के साथ सो रहे महज 7 माह के बच्चे को उठाकर ले गया।
— SACHIN KAUSHIK (@upcopsachin) August 27, 2022
इस व्यक्ति को पकड़वाने में मदद कीजिये।
आप सिर्फ Retweet कर इसके फ़ोटो/वीडियो को Groups में share कर दीजिये, विशेष कर कासगंज, बदायूँ और बरेली साइड में।
मुझे भरोसा है ये अवश्य पकड़ा जाएगा। pic.twitter.com/fTnuGbSlsi
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more