ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖం ఎరుగదు అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అయితే ఇది సాధారణ విషయంలో నిజం కావచ్చును కానీ.. జోరుగా కురుస్తున్న వర్షంలో.. వరుణుడు దాపులేని వాటంన్నింటీనీ స్వాహా చేస్తున్న క్రమంలో.. ఈ అన్నం నాది.. దీనిపై నా పేరు రాసివుంది.. అన్నట్లుగా ఓ వ్యక్తి ఆహారం తీసుకుంటున్న వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. ప్రతీ అన్నం మెతుకుపై తినేవాడి పేరు రాసిఉంటుందని ఉర్ధూలో ‘‘ధానే ధానే ఫర్ లిఖ్ కే రహతాహై ఖానేవాలా కా నామ్’’ అని ఓ నానుడి ఉంది. నెట్టింట్లో వైరలవుతున్న ఈ వీడియోను చూసినవారు కన్నీళ్లను చమర్చుతూ కాదనలేకుండా ఉండలేరు.
కుడి చెత్తే తింటూ.. ఎడమ చేత్తో కూడా కాకిని కొట్టలేని వారినైనా ఈ వీడియో కంటితడి పెట్టేలా చేస్తోంది. పేదలకు ఓ పూట అన్నం పెట్టేలా చేస్తోంది. దేశంలో అన్నమో రామచంద్రా అంటూ అంగలార్చే జీవుల కథలను, వ్యధలను కళ్లకు కట్టినట్టు.. నయా ప్రపంచంలో బతుకుతూ.. అందమైన కళలు కంటూ.. అదే లోకమని భావించే మేధోసంపత్తి కలిగిన మహనీయులకు కూడా ఈ వీడియో.. కోటి విద్యలు కూటి కోరకే అన్న సత్యాన్ని మరోమారు అవిష్కరింపజేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఉన్నది ఏమిటీ.? అంటే.. జోరు వర్షంలో ఓ వ్యక్తి తనకు లభించిన ఆహారాన్ని వరుణుడు స్వాహా చయకుండా ప్లేట్‌ను స్కూటర్ కింద ఉంచి తినడం కనిపిస్తుంది.
జిందగి గుల్జార్ హై అనే పేజ్ ట్విట్టర్లో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను షేర్ చేసింది. ఈ షార్ట్ క్లిప్‌లో వ్యక్తి జోరు వానలో కడుపు నింపుకునేందుకు స్కూటర్ కింద ఉంచిన ప్లేట్ నుంచి ఆహారం తినడం అందరి హృదయాలను కలిచివేస్తోంది. ఓ జీవితమా..నీ మీద నాకెన్నో ఫిర్యాదులున్నా ఈ సన్నివేశం చూడగానే వాటన్నింటినీ వదిలేశానని పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇవ్వడం అందరినీ కదిలిస్తోంది. ఇది చాలా బాధాకరం..దీన్ని వర్ణించేందుకు మాటల్లేవ్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా ఆకలి ఎంత కిరాతకమైందో అని మరో యూజర్ రాసుకొచ్చారు.
बड़ी शिकायत थी तुझसे ऐ ज़िन्दगी
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 11, 2022
लेकिन जब ये मंजर देखा तो सारी शिकायत छोड़ दी हमनेpic.twitter.com/gJ651OSCJn
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more