అమెరికాకు చెందిన ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ, ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్నెట్ ట్యాక్సీ ఉబర్ సంస్థ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇటీవల ఓ 18 ఏళ్ల హ్యకర్ ఉబర్ సంస్థకు చెందిన ఉద్యోగిని మభ్యపెట్టి అతని నుంచి క్రెడెన్షియల్స్ పోంది.. వాటి సాయంతో డేటా చౌర్యం చేసినట్లుగా స్ర్కీన్ షాట్లు తీసిన వాట్సాప్ లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా డేటా లీక్ అయ్యిందన్న అలజడి రేగి.. ఉబర్ కస్టమర్లు అందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉబర్ సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఇటీవల తమ సంస్థలోని ఓ ఉద్యోగి సాయంతో చోరబడిని హ్యాకర్ ఎలాంటి డేటాను తస్కరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సంస్థ ప్రకటించింది. తమ సంస్థకు చెందిన సున్నితమైన డేటా (ట్రిప్ హిస్టరీ లాంటి) ఏదీ చౌర్యానికి గురైనట్లు ఆధారాలు లేవని చెప్పింది. ప్రస్తుత్తం తమ సంస్థ నిర్వహిస్తున్న ఉబర్, ఉబర్ ఈట్స్, ఉబర్ ఫ్రైయిట్, ఉబర్ డ్రైవర్ సహా అన్ని యాప్ లు యధాతథంగానే నడుస్తున్నాయని ప్రకటనలో పేర్కోంది. సంస్థకు చెందిన ఓ ఉద్యోగి యాప్, వర్క్ స్పేస్ మెసేజింగ్ యాప్ లోకి హ్యాకర్లు చొరబడటంతో ఉబర్ డేటా ఉల్లంఘనకు గురైంది.
అయితే ఇటీవల ఓ కొత్తగా హ్యాకింగ్ నేర్చుకుంటున్న ఓ హ్యాకర్ తమ సంస్థకు చెందిన ఉద్యోగి లాగిన్ ఐడీ, పాస్ వర్డులను మభ్యపెట్టి తెలుసుకుని.. సంస్థ కంపూటర్లలోకి చోరబడ్డాడన్న విషయాన్ని ఉబర్ ధ్రువీకరించింది. గత ఏడాది నుంచి చురుగ్గా ఉన్న ‘లాప్సస్$’ అనే హ్యాకింగ్ గ్రూప్ తమపై ఈ సైబర్ దాడికి పాల్పడిందని ఉబర్ వెల్లడించింది. టెక్నాలజీ కంపెనీలను హ్యాక్ చేసేందుకు లాప్సన్ ఈ పద్ధతులను పాటిస్తోందని, ఈ ఏడాదిలోనే మైక్రోసాఫ్ట్, సిస్కో, శామ్సంగ్, ఎన్విడియా, ఓక్టా వంటి వాటిపై కూడా సైబర్ దాడి చేసిందని ఉబెర్ పేర్కొంది. గత వారమే ఉబర్ పై సైబర్ దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు దాడి పరిధి అస్పష్టంగా ఉంది.
హ్యాకర్లు అనేక అంతర్గత సిస్టమ్‌లను యాక్సెస్ చేసినట్లు ఉబెర్ ఇప్పుడు స్పష్టం చేసింది. అయితే, ఏదైనా మెటీరియల్ ఇంపాక్ట్ ఉందా? అన్నదానిపై కంపెనీ ఇంకా దర్యాప్తు చేస్తోంది. కాగా, హ్యాకర్లు తమ కంపెనీ మొబైల్ యాప్‌లకు శక్తినిచ్చే ‘ప్రొడక్షన్ సిస్టమ్‌లను’ యాక్సెస్ చేయలేదని ఉబర్ పేర్కొంది. కాబట్టి వినియోగదారుల ఖాతాలు, క్రెడిట్ కార్డ్ నంబర్లు, బ్యాంక్ ఖాతా సమాచారం, ట్రావెల్ హిస్టరీ వంటి సున్నితమైన సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే డేటా బేస్‌లు కూడా సురక్షితంగా ఉన్నాయని కంపెనీ హామీ ఇచ్చింది. తమ వినియోగదారుల క్రెడిట్ కార్డు సమాచారంతో పాటు వ్యక్తిగత డేటాను చాలా భద్రంగా ఉంచుతామని, అదనపు రక్షణ కల్పిస్తామని ఉబర్ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more