విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవరోజు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ తొమ్మిది రోజలు పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తలకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. దేవి శరన్నవరాత్రులు అక్టోబర్ ఐదో తేదీ వరకు కొనసాగుతాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది.
తొలిరోజు దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా కనకదుర్గమ్మ దేవీ భక్తులను అనుగ్రహించగా, రెండవ రోజూన బాలత్రిపుర సుందరి అవతారంలో, మూడవ రోజున గాయత్రీ దేవిగా.. నాల్గవ రోజున శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనవిచ్చిన కనకదుర్గమ్మతల్లి.. ఐదవ రోజున లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. శరన్నవరాత్రులలో ఐదవ రోజు అమ్మ లలితా త్రిపుర సుందరీదేవిగా అనుగ్రహిస్తున్న తరుణంలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
త్రిపురాత్రయంలో లలితా త్రిపుర సుందరీదేవి రెండో దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో, సకల లోకాతీత కోమలత్వంతో ప్రకాశిస్తుంది. ఈ తల్లి మణిద్వీప నివాసిని. సకల సృష్టి, స్థితి, సంహారకారిణి, శ్రీవిద్యా స్వరూపిణి. ఉపాసకులకు ముఖ్య ఆరాధ్యదేవత. ‘చిదగ్నికుండ సంభూతా’ అని లలితా సహస్రనామం చెబుతోంది. సకల విశ్వచైతన్య శక్తిస్వరూపం శ్రీచక్రం. ఈ శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత లలితా త్రిపురసుందరి. కోటి సూర్యుల ప్రకాశంతో సమానమైన కాంతి స్వరూపంతో, చేతిలో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూలబాణాలు ధరించి ఉంటుంది. ఈమెకు లక్ష్మీసరస్వతులు.. వింజామరలతో వీస్తూ సేవలు చేస్తుంటారు. లలితా త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే సకల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more