తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా ఇక మీదట కార్యక్రమాలు ఉండాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణకు మద్దతు తెలిపే ఏ వ్యక్తినైనా, పార్టీనైనా భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఈనెల 30న తెలంగాణవాదులు నిర్వహించే తెలంగాణ మార్చ్‌కి దీటుగా అదే రోజున చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. దీనికి విద్యార్థులను సమాయత్తం చేసే దిశగా సదస్సులు నిర్వహించాలని నాయకులు తీర్మానించారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more
Sep 17 | తెలంగాణా విమోచన దినోత్సవం రోజునే ధ్వంసానికి తెరలేచింది. హైదరాబాద్‌లోని కెబిఆర్ పార్క్ వద్ద వున్న కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని ఈరోజు తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా టైర్లు... Read more