ఎన్నికలు ముగిన తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ భవన్ లో పార్టీ విస్త్రుత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో భేటీ ముగిసిన తర్వాత కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఎవరి మద్దతు లేకుండా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్నారు. మే 17 తర్వాత టీఆర్ఎస్ అధికార పార్టీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఎట్టిపరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమన్నారు. కేంద్రంలో తమ మొదటి ప్రాధాన్యత యూపీఏ ప్రభుత్వానికేనని, లేకుంటే థర్డ్ ఫ్రంట్‌కు మద్దతిస్తామన్నారు. సోనియా, రాహుల్ గాంధీ పట్ల తమకు వ్యతిరేకత లేదని కేసీఆర్ చెప్పారు. సీమాంధ్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కె. చంద్రశేఖరరావు అన్నారు.
ఏపీలో జగన్ సీఎం కాబోతున్నారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వందకుపై అసెంబ్లీ సీట్లు వస్తాయని తమ సర్వేలో తేలిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అసెంబ్లీ స్థానాలు 23 నుంచి 35 దాటవని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more