రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇటు టీఆర్ఎస్, అటు ఆంధ్ర ప్రభుత్వాలు మొదటి నుంచి తిట్టుకోవడమే సరిపోతోంది కానీ... ఏనాడు రెండు రాష్ట్రాల్లో వున్న సమస్యల పరిష్కారాల గురించి చర్చించుకోలేదు. గవర్నర్ సమక్షంలో రెండుమూర్లుసార్లు కలుసుకున్నారు కానీ.. తర్వాత అంతా మామూలే! నువ్వెంతా..? నేనంతా..? అని సవాళ్లు విసురుకోవడంలోనే సమయం గడిచిపోతోంది. అంతేకాదు.. టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులకు కోసం కొత్తకార్ల ఆఫర్ ఇచ్చిందో లేదో.. ఇదే స్కీమును అక్కడ ఆంధ్రాలో ప్రవేశపెట్టేశారు. ఓవైపు రైతులు తల్లడిల్లుపోతుంటే.. ఈ రెండు ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధిపేరుతో పోటీపడుతూ అనవసరమైన విషయాల్లో ఖర్చు చేస్తున్నారు. మొత్తానికి చెప్పదల్చుకున్నదేమిటంటే.. తిట్టుకోవడం, పోటీపడటం తప్ప కలిసికట్టుగా వ్యవహరించే శైలి ఇద్దరు చంద్రుల్లో ఇంకా ఏర్పడలేదు.
ఇలా ఇద్దరు సీఎంలు ఒకర్నొకరు తిట్టుకోవడానికి చూసి ఇప్పటికే ఎంతోమంది నేతలు ఇద్దరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించకుండా.. రెండు రాష్ట్రాల్లోనూ మరిన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే విధంగా ప్రవర్థిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ తరహాలోనే తాజాగా వైసీపీ నేత మైసూరారెడ్డి ఇద్దరు సీఎంల వ్యవహారశైలిపై విరుచుకుపడ్డారు. ఇద్దరు సీఎంలు కేవలం ఒకర్నొకరిపై కోపగించుకోవడం తప్ప ప్రజలకు మేలుకలిగేలా సామరస్యంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని, ఉద్రిక్త పరిస్థితులకు కారణంగా నిలుస్తున్నారని ఆయన విమర్శించారు. శుక్రవారం పోలీసుల మధ్య జరిగిన సాగర్ గొడవ నేపథ్యాన్ని ఈయన గుర్తూ చేస్తూ.. ఇద్దరు ముఖ్యమంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ...
* చర్చల ద్వారా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాల్సిన తెలుగురాష్ట్రాల సీఎంలు.. ఇరురాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేందుకు కారణాంగా నిలుస్తున్నారని మైసూరా రెడ్డి ఆరోపించారు.
* గవర్నర్ తో ముందుగానే చర్చలు జరిపివుంటే.. ఈ సాగర్ గొడవలు జరిగేవి కాదు కదా అని ఆయన జోష్యం పలికారు.
* ప్రజాతీర్పుతో గెలుపొందిన సీఎంలు చర్చలకోసం నామినేటెడ్ గవర్నర్ వద్దకు వెళ్లడం కూడా సరికాదని అభిప్రాయపడ్డారు.
* శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే కొట్టుకోవడం చాలా సిగ్గుచేటని అన్నారు.
శనివారం ఉదయం గవర్నర్ సమక్షంలో కేసీఆర్, బాబు ‘సాగర్’ గొడవపై చర్చలు జరిపారు. ఈ భేటీ అయిన తర్వాత మైసూరారెడ్డి మీడియాతో పై విధంగా మాట్లాడారు. ఈయన చేసిన వ్యాఖ్యానాలకు కొందరు మద్దతు పలికారు. సీఎంలు సఖ్యతగా నడుచుకుంటేనే రాష్ట్రాల్లో సమస్యలు పరిష్కారమవుతాయని హితువు పలికారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more