నిత్యం టీఆర్ఎస్, ఆ పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిప్పులు చెరిగే టీటీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి.. మరోమారు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. జనం రక్తాన్ని పీలుస్తున్న జలగలా కేసీఆర్ మారారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మీడియాలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ సర్కారుపై విమర్శల వర్షాన్ని కురిపించారు.
తెలంగాణ పేరిట ఇంకా ప్రజలకు కేసీఆర్ సర్కార్ మభ్యపెడుతూనే వుందని, తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వంగా మారిపోయిందని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతు సమ్యసలపై సర్కారును నిలదీయనున్నామని పేర్కొన్న ఆయన.. కరువు, నీటి సమస్య, అవినీతి అంశాలపై ప్రధానంగా పోరు సాగిస్తామని చెప్పారు. కేసీఆర్ కేవలం మాటలతోనే సరిపెడుతున్నారని, చేతలతో ఇంకా చేసి చూపించింది ఏమీ లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు.
అలాగే.. టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై గవర్నర్ నరసింహన్ కూడా జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more