ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే తాజాగా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ మీద నిప్పులు చెరుగుతూ.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీద ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ కంటే ఫడ్నవీస్ చాలా బాగా పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కంటే మహారాష్ట్ర సర్కారు మంచి పనులు చేస్తోందని, అలాగే కొనసాగితే త్వరలోనే మహారాష్ట్ర రాష్ట్రం దేశంలో అత్యున్నత స్థానానికి ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు.
మహారాష్ట్రలో నీటి సంరక్షణ, పనిచేయని అధికారులకు జరిమానాలు విధించడం వంటి మంచిపనులు చేపట్టారని ఫడ్నవీస్ ను మెచ్చుకున్నారు. అయితే.. తాను రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడడం లేదని స్పష్టం చేశారు. ఇదిలావుండగా.. మోదీ సర్కారు తెచ్చిన భూసేకరణ బిల్లును హజారే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్టీఏ ప్రతిపాదించిన ఈ బిల్లులో రైతు వ్యతిరేక అంశాలు తొలగించాలని.. లేకపోతే మరోసారి దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు.
ఈ క్రమంలోనే మోడీ మీద హజారే నిప్పులు చెరుగుతూ.. ‘మోడీ రైతుల కంటే కార్పొరేట్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని ఆరోపించారు. రైతులను రక్షించే విధంగా బిల్లులో ప్రభుత్వం మార్పులు చేయకుంటే దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’ ఉద్యమం చేబడతానని స్పష్టం చేశారు. రెండో ప్రత్యామ్నాయంగా 2011లో తాను చేసిన నిరాహార దీక్షను మరోసారి చేస్తానని హజారే పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more