తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అప్పుడప్పుడు తనదైన శైలిలో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఆ విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. సాధారణంగా చెప్పుకోవాలంటే ఇటు టీఆర్ఎస్, అటు టీడీపీ పార్టీ మధ్య అంతగా సఖ్యత సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే! దీంతో ఆ రెండు పార్టీలు ఒకదానిపైమరొకటి విమర్శలు చేసుకుంటుంటాయి. ఆ పార్టీ నేతలూ తమతమ స్టైల్లో ఆరోపణలు చేసుకోవడం, కొన్ని వ్యవహారాల్లో బేరీజు వేసుకుని ఎద్దేవాలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఈ తరహాలోనే కవిత ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడ్డారు.
మొదట టీడీపీ పార్టీ గురించి కవిత మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వేగాన్ని టీడీపీ అందుకోలేకపోతోందన్న మాటను చెప్పేందుకు ‘కారు స్పీడును సైకిల్ అందుకోలేకపోతోంది’ అని పదప్రయోగం వాడారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అన్నివిధాల దూసుకుపోతోందని.. చెప్పిన హామీలను సమర్థవంతంగా నెరవేర్చడంలో పార్టీ ముందుందని ఆమె అన్నారు. అలాగే.. సరికొత్త విధానాలు అవలంబిస్తూ ప్రజలకు అనుకూలంగా వుండేవిధంగా ప్రణాళికలు చేపడుతున్నామన్న అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇక ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మీద ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో జరిపిన పర్యటనపైనా ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో రాహుల్ పర్యటన పిక్నిక్ కు వచ్చి వెళ్లినట్లుగా వుందని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళుతోందని.. త్వరలోనే గుజరాత్ ను అధిగమిస్తాని ధీమా వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more