ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆంధ్రరాష్ట్ర ముఖ్యంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించినవారు ఇంకెవరూ లేరని ఆయన ఆరోపించారు. ‘ఏపీ ప్రత్యేక హోదా’ సదస్సులో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు మీద తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బాబు పూర్తిగా అటకెక్కించారని అన్నారు. అన్ని విషయాల్లోనూ ప్రజలను దగా చేశారని, అందుకే టీడీపీ చేసుకోవాల్సింది మహానాడు కాదని, దగానాడు అని ఆయన ఆగ్రహంతో వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఆయన బాబు మీద ఎన్నో ఆరోపణలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ వ్యవహారాన్ని మరోసారి ఆయన గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ను ఎలా మోసం చేసిందీ, ఆయన అకాల మరణానికి కారణమైన తీరుపై దగానాడులో చర్చించాలని రఘువీరా ఈ సందర్భంగా చంద్రబాబుకు సూచించారు. హరికృష్ణ సహా మిగతా వాళ్లను ఎలా మోసం చేశారో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ‘ఒక చరిత్ర-కొన్ని నిజాలు’ అనే పుస్తకం కూడా రాశారని ఆయన అన్నారు. అధికారంలో రాకముందు జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రతి ఊరు తిప్పి, బాగా వాడుకున్నారని.. అయితే ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ను ఆమడదూరంలో పెట్టారని అన్నారు. లోకేశ్‌ను ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టారని విమర్శించారు.
అలాగే.. ఏపీలో ప్రస్తుతం సూట్‌కేసు-బ్రీఫ్‌కేసు ప్రభుత్వం నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. పెద్దబాబుకు బ్రీఫ్‌కేసు...చిన్నబాబుకు సూట్‌కేసు ఇస్తేనే పనులు అవుతున్నాయని రఘువీరా వ్యాఖ్యలు చేశారు. రైతులు, మహిళలను చంద్రబాబు వంచించారని, బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశామన్న ఆయన.. మళ్లీ అదే పార్టీతో పొత్తు కొనసాగించటం రాజకీయ వ్యభిచారమే అన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి విరాళాల సేకరణ కోసం హుండీ ఏర్పాటు చేశారని, ఆ విరాళాలు ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లేందుకే అని రఘువీరా మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more