Congress Mp Hanumantha Rao questioned Pawan kalyan | vote for note controversy | Chandrababu Naidu

Congress mp hanumantha rao questioned pawan kalyan over vote for note controversy

hanumantha rao, congress mp vh, pawan kalyan, vote for cash controversy, chandrababu naidu, two telugu states, telangana govt, andhra pradesh govt, pawan kalyan updates, pawan with chandrababu naidu, chandrababu controversy, trs party news

Congress Mp Hanumantha Rao questioned Pawan kalyan over vote for note controversy : Congress Mp Hanumantha Rao questioned Pawan kalyan to give responce on vote for cash controversy which creates sensation in two telugu states.

పవన్ ఇప్పుడు నోరెందుకు విప్పడం లేదు : వీహెచ్

Posted: 06/20/2015 03:24 PM IST
Congress mp hanumantha rao questioned pawan kalyan over vote for note controversy

అవినీతి జరిగిన సందర్భంలో తాను ప్రజల తరఫున ప్రశ్నిస్తానని పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ వెల్లడించిన విషయం తెలిసిందే! ఆయన చెప్పినట్లుగానే కొన్ని సందర్భాల్లో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. ముఖ్యంగా ఏపీలో ఆమధ్య రాజధాని విషయమై చెలరేగిన వివాదాలపై పవన్ నేరుగా రైతులతో కొద్దిసేపు మంతనాలు జరిపారు. అలాగే రాష్ట్రప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో ప్రశ్నించారు కూడా! కానీ.. ఇప్పుడు తన సినిమా విషయంలో బిజీగా వుండటంతో పవన్ రాజకీయ వ్యవహారాలపై ఏమాత్రం స్పందించడం లేదు.

ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతున్న ‘ఓటుకు నోటు’ వ్యవహారంపై ఆయన నోరు మెదపకపోవడంపై విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే దర్శకనిర్మాత రాంగోపాల్ వర్మ ట్విటర్ వేదికగా పవన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు తాజాగా సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. అవినీతిని ప్రశ్నిస్తానని హీరో పవన్.. ఇప్పుడు రెంగు రాష్ట్రాల రాజకీయ వివాదంపై ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన అడిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పో, ఒప్పో పవన్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరి.. వీహెచ్ సంధించిన ప్రశ్నలపై పవన్ స్పందిస్తాడా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే!

పవన్ పై ప్రశ్నలు సంధించిన తర్వాత ఆయన చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు బాబు కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారని, ఓ రాష్ట్రానికి సీఎంగా వుండి ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని వీహెచ్ అన్నారు. మరి.. ఈయన చేసిన ఈ కామెంట్లపై టీడీపీ వర్గాలు ఏ విధంగా సమాధానమిస్తాయో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hanumantha rao  pawan kalyan  chandrababu naidu  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more