gali muddu krishnama naidu fires on trs party, cm kcr and ysrcp | vote for cash controversy | section 8

Gali muddu krishnama naidu fires on trs kcr ysrcp in vote for cash controversy

gali muddu krishnamanaidu, gali muddu krishnama naidu stills, gali muddu krishnama naidu press meet, cm kcr, vote for cash, phone tapping, mla stephenson, trs party, chandrababu naidu, revanth reddy

gali muddu krishnama naidu fires on trs kcr ysrcp in vote for cash controversy : tdp leader gali muddu krishnamanaidu fires cm kcr in the case of vote for cash.

కేసీఆర్ ఏవేవో చేస్తున్నారు : గాలి

Posted: 06/25/2015 05:33 PM IST
Gali muddu krishnama naidu fires on trs kcr ysrcp in vote for cash controversy

టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తాజాగా టీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తారు. హైదరాబాదులోని ట్రస్టు భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. ‘ఓటుకు నోటు’ కేసులో ప్రధాన సాక్షి అయిన ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను కేసీఆర్ తన ఫాంహౌస్ లో పెట్టుకుని గూడుపుఠానీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసులో కీలకసాక్షి అయిన వ్యక్తిని కేసీఆర్ తన వద్ద పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

ఇక ఈ క్రమంలోనే ఆయన వైకాపా మీద కూడా మండిపడ్డారు. మే 21వ తేదీన వైసీపీ, టీఆర్ఎస్ నేతలు సితార హోటల్ లో కలుసుకన్నారని ఆయన విమర్శించారు. రాయలసీమ బాగుపడటం జగన్ కు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు కుమ్మక్కై టీడీపీని దెబ్బతీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వారి ఆటలు ఎక్కువకాలం కొనసాగవని ఆయన అన్నారు. ఇక సెక్షన్-8పై తాము ఎప్పటినుంచో మాట్లాడుతూనే వున్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ విధంగా గాలిముద్దుకృష్ణమనాయుడు చేసిన వ్యాఖ్యలపై ఇటు టీఆర్ఎస్, అటు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే! ఏదేమైనా.. ‘ఓటుకు నోటు’ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర కలకలం సృష్టించడంతోపాటు టీడీపీ పార్టీకి కాస్త దెబ్బ తెచ్చిపెట్టిందని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gali muddu krishnama naidu  cm kcr  stephenson  revanth reddy  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more