వైజాగ్ భూకుంభకోణంలో తెలుగుదేశం పెద్దల పాత్రలను నిలదీస్తూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మండిపడ్డాడు. సేవ్ విశాఖ పేరుతో గురువారం నిర్వహించిన మహాధర్నాలో జగన్ మాట్లాడుతూ, మంత్రి గంటా పాత్ర ఉందని ఆరోపించాడు. భారీ ఎత్తున భూములు కొట్టేసిన కబ్జా కోరుల నుంచి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడి ఆ డబ్బులు గంటా కింత, లోకేష్ కింత లెక్కన పంపకాలు జరుగుతున్నాయని ఆయన చెప్పాడు. ల్యాండ్ పూలింగ్ పేరిట భయపెట్టి, ప్రభుత్వం సేకరిస్తే కనీసం రెండు లక్షలు కూడా ఇవ్వదని రైతులను భయబ్రాంతులకు గురి చేసి అప్పనంగా దోచేస్తున్నారని ఆయన తెలిపాడు.
గీతం యూనివర్సిటీ యజమాని చంద్రబాబుకు బంధువు కావడంతో ఆయన కబ్జా చేసిన 55 ఎకరాలను కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి ఆ భూములు అధికారికంగా ఆయనకు అప్పగించారని ఆయన తెలిపారు. వైజాగ్ భూ కుంభకోణంలో టీడీపీ తీరు ఎలా ఉందంటే...రావణాసురుడు, సీతమ్మవారిని ఎత్తుకెళ్లాడా? లేదా? అన్నదానిపై కుంభకర్ణుడితో సిట్ వేయించినట్టు ఉందని ఎద్దేవా చేశాడు. రావణాసురుడు చేసిన తప్పుపై కుంభకర్ణుడితో సిట్ వేయించకుండా ఆంజనేయుడితో సిట్ వేయిస్తే నిజానిజాలు తేలిపోతాయని ఆయన చెప్పాడు. వైజాగ్ జిల్లా చంద్రబాబునాయుడుకు చాలా చేసిందని ఆయన చెప్పాడు.
మరి అలాంటి విశాఖపట్టణం జిల్లాకు చంద్రబాబునాయుడు స్కాములు, అవినీతి, దోచుకునేందుకు అనుమతులిచ్చాడని ఆయన విమర్శించాడు. భూకుంభకోణంపై వివరణ అడిగితే కలెక్టర్ హుదూద్ లో గల్లంతయ్యాయని సమాధానమిస్తున్నారని మండిపడ్డాడు. కలెక్టర్ గతంలో జీవీఎంసీ కమిషనర్ గా, జాయింట్ కలెక్టర్ గా, ఇప్పుడు కలెక్టర్ గా పని చేస్తున్నారని ఆయన తెలిపాడు. పేదలకు ప్రభుత్వం పంచి ఇచ్చిన అసైన్డ్ భూములను మంత్రుల అండతో తెలుగుదేశం పార్టీ నేతలు ఎలా దుర్మార్గంగా ఆక్రమించుకుంటున్నారో పత్రికల్లో వచ్చిన కథనాలను చూపిస్తూ నిప్పులు చెరిగి వైకాపా అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తెలుగుదేశం పార్టీకి వంతపాడే ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనాలనే చూపిస్తున్నానని చెప్పాడు.
"చోడవరం ఎంపీపీ... గొన్నూరు వెంకట సత్యన్నారాయణ అంటే పెద్దబాబు... కొమ్మాదిలో తన పేరుతో 24.3 ఎకరాలు, తన భార్య కొండతల్లి పేరుతో మరో 25 ఎకరాలు... వాళ్ల పేర్లతో భూములు రాయిచ్చేసుకున్నారు. 'ఈనాడు' కథనం. పేపర్లో వచ్చింది. ఇది 'సాక్షి' కాదు. ఈనాడు కథనాన్ని మాత్రమే చూపిస్తా ఉన్నా" అని అన్నారు. ఆక్రమణకు గురైన పేదల భూములను తిరిగి ఇప్పించేందుకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. 'గీతం' కాలేజీలు నడిపే చంద్రబాబు బంధువు ఎంవీవీఎస్ మూర్తి, రూ. 1000 కోట్ల విలువ చేసే 55 ఎకరాలు కబ్జా చేసి, ఆ భూములను తనకు ఇవ్వాలని చంద్రబాబుకు లేఖ రాస్తే, క్యాబినెట్ లో తీర్మానం చేసి మరీ అప్పనంగా కట్టబెట్టారని దుయ్యబట్టాడు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more