ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా
క్పరుషతఁ జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం
బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ
స్థిరతర సౌరుసంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా!
టీకా : ఉరుకరుణాయుతుండు = గొప్ప దయతో కూడినవాడు ; సమయోచితం = కాలానికి తగిన తనం ; ఆత్మన్ తలంచి = మనసును తెంచి ; ఉగ్రవాక్పరుషతన్ = గొప్పమాటల కాఠిన్యం ; చూచినన్ = కనిపించినప్పుడు ; ఫలము గల్గుట = ప్రయోజనం కలిగినప్పుడు ; తథ్యముగాదె = సంభవం కాదా? ; అంబుదంబు = మేఘము ; ఉఱిమినయంతన్ = ఉరిమిన వెంటనే ; లోకరక్షణ = ప్రపంచ రక్షణకు ; స్థిరతర = నిలకడగా వున్న ; పౌరుషంబున = శక్తితో ; లెఱుంగన్ = లోకంలో వున్నవారందరూ తెలుసుకోవడం ; కురియుకుండునె = వర్షం కురవదా అన్నట్టు
తాత్పర్యము : దయామయుడైన ఒక దొర సమయానుసారం కఠినంగా మాట్లాడినప్పటికీ, అవసరమొచ్చినప్పుడు ప్రతిఒక్కరికీ కొరత లేకుండా అన్ని అర్హతలు సమకూరుస్తాడు. అదెలాగంటే.. మేఘాలు ఉరిమినప్పుడు భయాన్ని కలిగించినప్పటికీ.. వెంటనే వర్షాన్ని కురిపించి సంతోషాలు తెస్తుందా కదా!
(And get your daily news straight to your inbox)
Apr 14 | ఈ జగమందు దా మనుజుఁ డెంత మహాత్మకుఁడైన దైవమా తేజము తప్పఁ జూచునెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁగాయలాకులున్ భోజనమై తగ న్వనికిఁబోయి చరింపఁడె మున్ను భాస్కరా! టీకా :... Read more
Apr 12 | ఈ క్షితి నర్ధకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం రక్షకుఁడైన సత్ర్పభుని రాకలు గోరుదు రెందుఁ, జంద్రి కా పేక్షఁజెలంగి చంద్రుఁ డుదయించు విధంబునకై చకోరపుం బక్షులు చూడవే యెదు రపార ముదంబును... Read more
Apr 11 | ఆరయ నెంత నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే కూర దదెట్లు; హత్తుగడగూడునె, చూడఁబదాఱువన్నె బం గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా!... Read more
Apr 08 | ఆదర మింతలేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికి భేదము చేయుటం దనదు పేర్మికిఁగీడగు మూలమె, ట్లమ ర్యాద హిరణ్య పూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుఁడైన ప్ర హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా ! టీకా... Read more
Apr 07 | అవని విభుండు నేరుపరియై చరియించినఁ గొల్చువార లె ట్లవగుణు లైననేమి? పను లన్నియుఁ జేకుఱు వారిచేతనే, ప్రవిమల నీతిశాలి యగు రామునికార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధిఁదాఁటి సురారులఁద్రుంచి భాస్కరా! టీకా : అవని... Read more