గుంటూరు పట్టణంలో జనవరి 16, 1935లో శ్రీ సి. జానకీరాం, శ్రీమతి సిజి లక్ష్మి దంపతులకు కొండూరు హనుమంతరావు గారు జన్మించారు. ఈయన కాకినాడ, గుంటూరు, నెల్లూరు మరియు చెన్నైలో విద్యాభ్యాసాన్ని సాగించారు.
1957
మద్రాస్ లో వెటర్నరీ సైన్స్(పశువైద్యశాస్ర్తం) లో 1957 లో డిగ్రీ చేశారు.
1959-61
మధ్య .డైరీ సైన్స్ లో స్పెషలైజేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చిత్తూర్ జిల్లా లోని పాలమ్నర్ లో ఉన్న డైరీ ఫాం లో పని చేశారు.
1961-63
తిరుపతిలోని ఆంధ్రా వెటర్నరీ కాలేజ్ లో డైరీ సైన్స్ అసిస్టెంట్ లెక్చరర్ గా పని చేశారు. తర్వాత జిల్లా వెటర్నరీ ఆఫీస్ లో ఉద్యోగం పొందారు.
1965-70
ఏపి ప్రభుత్వం భాగస్వామ్యంతొ క్రిష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ గా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో బాధ్యతలు నిర్వహించారు. అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో యానిమల్ హస్బెండరీ జాయింట్ డైరెక్టర్ గా పని చేశారు.
1983
అడిషనల్ డైరెక్టర్ గా 1983లో ప్రమోషన్ పొందారు
1984
అడిషనల్ డైరెక్టర్ గా 1983లో ఐఎయస్ క్యాడర్ పొంది డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ గా పదోన్నతి పొందారు ఏపి వేర్ హౌసింగ్ కార్పోరేషన్, ఏపి సీడ్స్ డవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీగా, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పోరేషన్ ఎండీగా, డైరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీగా, ఏపి ప్రభుత్వ జాయింట్ సెక్రటరీగా అడిషనల్ సెక్రటరీగా కూడా పని చేశారు.ప్రమోషన్ పొందారు
1993
ప్రభుత్వ సెక్రటరీగా 1993లో రిటైడ్ అయ్యారు.
దేశంలోని చాలా ప్రాంతాలను సందర్శించడమే కాకుండా ఆస్ట్రేలియా, యుఎస్ఎలను కూడా సదంర్శించారు. తెలుగువారిగా హిస్టరీ మీద ఎంతో ప్రేమ ఉన్న హనమంతరావు గారు ఆంధ్రుల చరిత్ర గురించి ఓ రచన చేశారు. ఆంధ్రుల చరిత్రలో ఆంధ్రుల సంస్ర్కృతి సంప్రదాయాలను వివరించడంతో పాటు, నేటి తరానికి చరిత్రను కళ్లకు కట్టినట్లు వివరించిన విశేషాలను విశేష్ డిజిటల్ మీడియా ద్వారా మీకు అందిస్తున్నాం..
ఆంధ్రుల చరిత్ర విశేషాలు..
మనదేశంలో హిందీభాష మాట్లాడేవారి సంఖ్య తర్వాత తెలుగుభాష మాట్లాడే వారి సంఖ్య రెండవదిగా ఆంగ్లేయుల కాలంనుండే గుర్తించబడింది. అటువంటి పురాతన చరిత్ర కల్గిన మన తెలుగువారి పుట్టుపూర్వోత్తరాలు ఉన్న ఆధారాలను బట్టి కొంతైనా తెలుగుకొని తెలుగువారు ఆనందించాలనే కోరికతో కొండూరు హనుమంతరావు గారు ఈ సంక్షిప్త 'ఆంధ్రుల చరిత్ర' వ్రాయడమైంది.