ఘంటసాల వెంకటేశ్వరరావు (1922 డిసెంబర్ 22 1974) ప్రముఖ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఘంటసాల జన్మతహ వచ్చిన గంభీరమైన స్వరముతో, పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణుడైన శాస్ర్తీయ సంగీత శిక్షణతో ఈయన తెలుగు సినీ సంగతము ఒక విధమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డారు. అర్థ శతాబ్దము పాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశారు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరం నేపధ్యగాయకులలో ప్రముఖుడు. బాల్యం : ఘంటసాల 1922 డిసెంబర్ 4న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామములో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించాడు. సూర్యనారాయణ మ్రుదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. ఆయన ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభా స్థలికి వెళ్ళేవారు. ఘంటసాల అక్కడున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవారు. ఘంటసాల నాట్యానికి ముగ్దులై ఆయనను ‘భాల భరతుడు’ అని పిలిచేవారట. సంగీత సాధన : తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా, ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేసారు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వులపాలయ్యారు. అప్పటి నుండి ఆయనలో పట్టుదల పెరిగింది. తనకు తెలిసిన కొందరు సంగీత విద్యాంసుల ఇళ్ళలో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నారు. రెండేళ్ళ కాలంలో ఒకఇంట్లో బట్టలు ఉతకడం, మరొక ఇంట్లో వంటచేయడం నేర్చుకోవలసి వచ్చింది. ఆలస్యమైనా తనతప్పు తెలుసుకున్న ఘంటసాల తనదగ్గరున్న నలభై రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకున్నాడు. విజయనగరం చేరినప్పటికీ వేసవి సెలవులు కారణంగా ఆ కళాశాల మూసిఉంది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బసచేయడానికి అనుమతి ఇచ్చారు. ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా తోటి విద్యార్థులు చేసిన తప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాల వారు తమ ఇళ్ళకు రావద్దన్నారు. గత్యంతరం లేక ఆ పూరి ఎల్లమ్మ గుడికి చేరుకుని అక్కడ తలదాచుకున్నాడు. అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామ శాస్ర్తి ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఘంటసాల జీవితంలో ఎన్నోసార్లు గురువంటే ఆయనే అని చెప్పేవారు. శాస్ర్తిగారు చాలా పేదవారు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయం కల్పించలేక పోయారు. ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలె కట్టి మాధుకరం ( ఇంటింటా అడుక్కోవడం) చేయడం నేర్పించాడు. భుజాన జోలెకట్టుకొని వీధివీధి తిరిగి రెండు పూటలకు సరిపడే అన్నం తెచ్చుకునేవాడు. మిగిలిన అన్నాన్ని ఒక గుడ్డలో పెడితే చీమలు పడుతుండేవి. గిన్నె కొనుక్కోవడానికి డబ్బులేక మేనమామకు ఉత్తరం వ్రాయగా ఆయన పంపిన డబ్బుతో ఒక డబ్బా కొనుక్కొని అందులో అన్నం భద్రపరిచేవాడు. తర్వాత కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచి పేరు తెచ్చుకొని తన సొంతవూరు అయిన చౌటుపల్లెకు చేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ కార్యక్రమాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవారు. 1942లో స్వాతంత్ర్య సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండు సంవత్సరాలు ఆలీపూర్ జైల్లో నిర్భందంలో ఉన్నాడు. సినీ ప్రస్థానం : మార్చి 4న ఘంటసాల తన మేనకోడలు సావిత్రిని పెళ్లిచేసుకున్నాడు. ఆరోజు సాయంత్రం తనపెళ్ళికి తానే కచేరి చేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తారు. కొన్నాళ్ళకు దగ్గరివూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినప్పుడు ఆయనను కలిశారు. ఘంటసాల సామార్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నాడు. ఘంటసాల రెండు నెలలు కష్టపడి కచేరీలు చేసి, కొంత అప్పు చేసి మద్రాసు వెళ్లారు. సముద్రాల ఘంటసాలను రేణుకా ఫిలిస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్. రెడ్డిల ముందు పాట కచేరీ చేయించారు. వారివురు పాట కచేరి విని అవకాశాలు ఉన్నప్పుడు ఇస్తామన్నారు. విజయ విహారం : 1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతటా మారుమోగిపోయింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు. తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందటానికి సాలూరి రాజేశ్వర్ రావు సంగీతానికి ఘంటసాల గాత్రం తోడవటమే.... 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీ జీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలో తన నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరావు చెబుతుంటారు ఇప్పటికీ. ఇక్కడ గర్వించదగ్గ విషయం ఏంటంటే... ఘంటసాల గొప్పస్థితికి చేరుకున్నా తనను ఆదరించిన వారిని మరువలేదు. ఆయన ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడు కాదు. కోరిన వారికి కాదనక సహాయం చేసేవాడు. నాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె అవాత్సల్యపూరితమైన బిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది అని ఎన్నోసార్లు చెప్పేవారు. అందుకే ఘంటసాల ఈ తరానికి కూడా చిరస్మరణీయంగా నిలుస్తున్నాడు. |
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more