నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి అయినా ఆదియుగం నుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి. జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు. సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు. అతడే... ఉపాధ్యాయుడు, సృష్టి స్థితి లయల నిర్దేశకుడు! అలాంటి మహోన్నత మహాఋషికి నేటి సమాజంలో అడుగడుగునా ఆటంకాలే... వెటకారాలు, ఛీదరింపులు, వెండతెరపై ఆటపట్టింపులు... ఎదురుదెబ్బలు ఎన్ని తగిలినా... బుద్ధినే సిమెంటుగా, జ్ఞానాన్నే ఇటుకలుగా, వివేకాన్నే కాంక్రీటుగా మలిచి విజ్ఞానమనే భవంతుల్ని నిర్మిస్తున్న నిత్య శ్రామికుడు. నిత్యాణ్వేషిగా, నిత్య విద్యార్థిగా జ్ఞాన కుసుమాలు పూయిస్తున్న ఆ విజ్ఞాన ఖనిని ‘గురుపూజోత్సవం’ సందర్భంగా మనసారా పూజించుకుందాం... మనసెరిగిన మాస్టార్లకు పాదాభివందనాలర్పిద్దాం...
మన దేశంలో సెప్టెంబర్ 5నే ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఆ రోజు భారత ద్వితీయ రాష్టప్రతిగా అద్వితీయంగా తన పద వీ బాధ్యతలను నిర్వహించిన డా సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888-1975) జన్మదినం కావడమే. 1962 నుండి 1967 వరకు దేశాధ్యక్షు డిగా పని చేసిన రాధాకృష్ణన్ ప్రారంభంలో ఉపాధ్యాయుడు. స్వయంగా ఉపాధ్యాయుడైన ఆయన విద్య మీద అపార నమ్మకంగలవాడు. విద్యాధికులు మాత్రమే దేశ సౌభాగ్యానికి చు క్కానులని ఆయన విశ్వసించేవారు. వాస్తవాని కి ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5న జరపవలసిందిగా కోరిందీ ఆయనే. తన పుట్టిన రోజునాడు తనను అభినందించడానికి వచ్చిన తన అభిమానులను ఆయన ఈ రోజు నన్ను అభినందించడంకంటే ఉపాధ్యాయుల ను అభినందించడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందనడంతో ఆ రోజు నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాధాకృష్ణన్ పుట్టిన రోజునాడు నిర్వహించడం జరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా గొప్పవారైన వారిలో అనేకమంది తమ గొప్పతనాన్ని తమ గురువులకు ఆపాదించడం మనం చూస్తూనే ఉన్నాం.
ఆచార్యదేవోభవ...
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరు వాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. గురువు అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. ‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. ‘గు’ అంటే గుహ్యమైనది, తెలియనిది. ‘రు’ అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యా ర్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం.విద్యాలయంలో తన విద్య పూర్తి కాగానే ఆ ఉపాధ్యాయుడితో తన పని పూర్తయి పోయిందను కోకూడదు. విద్యాలయం నుంచి బైటికొచ్చాకే అతనికి ఉపాధ్యాయుడి సందేశం అవసర మవుతుంది. అప్పటివరకు కంటికి రెప్పలా చూసుకున్న ఉపాధ్యాయుడి స్థానంలో అతనికి ఆ ఉపాధ్యాయుడి సందేశం మాత్రమే తోడుగా ఉంటుం ది. కాబట్టి ఉపాధ్యాయుడి దగ్గర్నుంచి అప్పటి వరకు తాను నేర్చుకున్న నడవడి, క్రమశిక్షణ మాత్రమే అతను పై అంతస్తులకు ఎదిగేందు కు దోహదపడతాయి. ఇప్పుడే విద్యార్ధి అత్యం త జాగరూకతతో నడుచుకోవాలి. ఇది అతని భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి తన గురువును తలుచుకుంటూ అడుగులేస్తే ఆ అడుగులు మరి అభ్యుదయంవైపే చకాచకా సాగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
మాజీ రాష్టప్రతి కలాం కూడా గతంలో ఉపా ధ్యాయుడే. పదవీ విరమణ అనంతరం ఆయ న మరలా ఉపాధ్యాయ వృత్తిని చేపడుతుండ డం ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్నీ, విశిష్టత ను తెలియజేస్తుంది. ప్రపంచంలో ‘సర్’ అని ప్రతి ఒక్కరూ సంబోధించతగ్గ ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే. దేశాధ్యక్షుడు సైతం ‘సర్’ అని సంబోధించవలసిన ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే. సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉ పాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించతగ్గ విషయం. ఇది సర్వత్రా వాంచనీయం. ఈ రోజుని ప్రతి విద్యా లయంలోనూ ఎంతో ఘనంగా నిర్వహించా లి. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం ద్వారా వారి సేవలను గౌరవించాలి. వారి ఆదర్శాలను అనుసరించాలి. ఒకప్పుడు ‘బ్రతకలేక బడి పంతులు’ అనిపించుకున్న వృత్తి నేడు నేడు ‘బ్రతుకు కొరకు బడి పంతులు’ అని వేనోళ్ళ కీర్తించబడుతుందంటే అందుకు కారణం సంఘ నిర్మాణంలో ఉపాధ్యాయుడు నిర్వర్తించిన పాత్రతప్ప మరోటి కాదు.
అందుకే వేమన గారు అప్పిచ్చువాడు, వైద్యుడు, ఆగక పారే నీరు ఉన్న ఊరిలో ఎలా నివ శించమన్నాడో అలాగే ఉపాధ్యాయుడు లేని ఊరిలో మాత్రం ఉండరాదని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయుడి అవసరాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆ ఆచార్య దేవుణ్ణి అన్నివిధాలా గౌరవిస్తేనే మన సంస్కృతిని మ నం గౌరవించినట్లు. ఎందుకంటే ఉపాధ్యా యుడు లేని ఊరు, చుక్కాని లేని నావ ఒక్క టే. చుక్కాని లేని నావలో ప్రయాణం ఎంత ప్రమాదకరమో ఉపాధ్యాయు డు లేని ఊరి ప్రజ అంతకంటే ఎక్కువ ప్రమాదకర పరిస్థిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బిడ్డకి తల్లీ, తండ్రీ ఎంత అవసరమో, తల్లిదండ్రులకు ఉపాధ్యా యుడూ అంతే అవసరం. ఈ వాస్తవాన్ని గ్రహించి ప్రతి పల్లె తమ ఊరు బాగుపడాలంటే ఉపాధ్యాయుడు తమకు కావాలనే అవసరాన్ని గుర్తిస్తే వారి జీవితాలు ఏరువాకలా ప్రశాంతంగా సాగుతాయి. ఆరుగాలం వారు శ్రమించి పండించిన పంటకు ఆరేడు కాలాలపాటు వర్ధిల్లేంతటి ఫలితమూ దక్కుతుంది.
ఇది సత్యం!... ఇదే సత్యం!!
టీచర్స్ డే ఆద్యుడు సర్వేపల్లి...
డా సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు మొ ట్టమొదటి ఉపరాష్టప్రతి, రెండవ రాష్టప్రతి కూ డా. అంతేకాదు భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని ప్రతీతి. 1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్ర పతి అయిన తరువాత కొందరు శిష్యులు, మి త్రులు, పుట్టిన రోజు జరపటానికి అతనివద్ద కు వచ్చినప్పుడు, ‘నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్స వంగా నిర్వహిస్తే నేను ఎంతో గర్విస్తాను’ అని చెప్పి ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను చాటారు. అప్పటినుండి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more