Amitabh bachchan at 70 years

Amitabh Bachchan, jaya bachchan,Bollywood's biggest star, turned 70 on Thursday, and said he liked the idea of getting old

Amitabh Bachchan, Bollywood's biggest star, turned 70 on Thursday, and said he liked the idea of getting old

Amitabh Bachchan at 70 years.png

Posted: 10/11/2012 05:03 PM IST
Amitabh bachchan at 70 years

Amitabh_Bachchanబాలీవుడ్ బిగ్ బి అమితా బచ్చన్ అంటే తెలియని వారు ఉండరు. సుప్రసిద్ధ నటుడిగా ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన అమితాబ్ నేడు తన 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మరి అమితాబ్ పుట్టిన రోజు సందర్భంగా అతను శిఖరాల దిగా సాగించిన ప్రయాణంలోని కొన్ని ములుపుల గురించి....

అమితాబ్ జీవిత పుస్తకం తెరిస్తే సముద్రం లోని ఓ కెరటాన్ని పోలివుంటుంది. సముద్రంలోని కెరటం పడిపోయిన ప్రతిసారి మళ్ళీ ఉవ్వెత్తున లేవడానికి ప్రయత్నిస్తుంది. అలాగే అమితాబ్ పని అయిపోయింది అనుకున్న ప్రతిసారీ ఉవ్వెత్తున లేచి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. సుదీర్ఘమైన అమితాబ్ సినీ ప్రస్థానంలో ఎన్నో తిరస్కారాలు... విమర్శలు... హేళనలు.... వాటన్నింటిని భరిస్తూ తనను తాను శిల్పంగా మలచుకొని శిల్పి ఆయన.

Amitabh_Bachchan1అమితాబ్ బచ్చన్ పుట్టింది కలకత్తాలో. ఆయనకు కన్నవాళ్లు పెట్టిన పేరు ఇంక్విలాబ్. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో తండ్రి హరివంశరాయ్, తల్లి తేజీ ఆ పేరును పెట్టారు. కానీ వారు కుటుంబ మిత్రుడు అయిన సుమిత్రానంద్ పంత్ కి ఆ పేరు నచ్చలేదు. అనంతమైన ప్రకాశం అనే అర్థంలో అమితాబ్ అని నామకరణం చేశాడు. నిజానికి ఆయన ఇంటిపేరు బచ్చన్ కాదు. అది హరివంశరాయ్ కలం పేరు. వాళ్ళ ఇంటి పేరు శ్రీ వాస్తవ. ఆరడుగుల ఎత్తు ఉండే అమితాబ్ సినిమాల్లోకి వెళ్ళాలని బలంగా కోరుకోలేదు. తమ్ముడు అజితాబ్ ప్రేరణతోనే రంగుల లోకం పైపు అడుగులు వేశారు. కలకత్తాలో ఉద్యోగం మానేసి బొంబయికి చేరుకున్నాడు. అక్కడ అవకాశాలు లేక సముద్రపు తీరంలో బల్లలపై ఆకలితో పడుకున్న రోజులూ ఆయన జీవితంలో ఉన్నాయి. చివరకు నర్గీస్ ఇచ్చిన సిఫార్సు లేఖను కె. అబ్బాస్ కి ఇస్తే సాత్ హిందుస్తాన్ లో నటించే అవకాశం ఇచ్చారు. అక్కడి నుండి అమితాబ్ సినీ ప్రస్థానం ప్రారంభమైంది. కానీ ఆయన బొంబయి వచ్చేటప్పుడు మాత్రం సినిమా అవకాశాలు దొరక్కపోతే... కారు డ్రైవర్ గా పనిచేద్దామని డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం వెంట తెచ్చకున్నాడట.

Amitabh_Bachchan2మొదట అమితాబ్ బచ్చన్ రేడియాలో వార్తలు చదువుదామనే ప్రయత్నంలో వాయిస్ టెస్ట్ కి వెళితే... ఇదేం గొంతు అని విమర్శించారు.. ఆ విషయం ప్రక్కన బెడితే... తరువాత కాలంలో సంభాషణ పలకాలంటే అమితాబ్ తరువాతే ఎవరైనా అన్నారు సినీ జనాలు. ఆయన సినిమాల్లో నటించే తొలినాళ్ళలో కొన్ని రేడియో వాణిజ్య ప్రకటనలకు వాయిస్ ఓవర్ చెప్పేవారు. అవి కూడా ఆరదణ పొందాయి. ఇటీవల పలు రాష్ట్రాల పర్యాకట శాఖల వారు తమ ప్రచార చిత్రాలకు అమితాబ్ గొంతుతో తమ చారిత్రక వైశిష్ట్యాన్ని చెప్పించుకున్నారు. . ఇక గాయకుడిగా తనదైన ముద్రను కూడా వేశారు. ఇటీవల (పా) చిత్రంలో కూడా మేరీ పా మేరీ హై అంటూ తన గొంతుతో అందర్ని అలరించారు.

అమితాబ్ కెరీర్ అంత సజావుగా ఏమీ సాగలేదు. కొన్ని అప్పులు చేసిన అమితాబ్ మళ్లీ నిలదొక్కుకునేందుకు కెమెరా ముందుకే రావాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో చేసిన చిత్రాలు అన్నీ పరాజయాలు అయ్యాయి. దీంతో బుల్లితెర ప్రవేశం కూడా చేశాడు. (కౌన్ బనేగా కరోడ్ పతి’) అనే కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఆయన ముందుకు వచ్చింది. దీనిపై సమగ్రంగా అధ్యనయం చేసి తనదైన శైలిలో రక్తికట్టించారు. నిజానికిది క్విజ్ పాత్ర అయితే దాన్ని హుందాగా అమితాబ్ నిర్వహించిన విధానం అమితాబ్ జీవితాన్ని మలుపు తిప్పింది. వరుస వాణిజ్య ప్రకటనలు, చిత్రాలతో దూసుకెళ్లారు.

అమితాబ్ జీవితంలో మరణానికి దగ్గరగా కూడా వెళ్ళి వచ్చారు. మన్మోహన్ దేశాయ్ దర్శకత్వంలో (కూలీ) సినిమా చేసే సమయంలో ఈ సంఘటన జరిగింది. 1982లో జులై 26న బెంగుళూరులో అమితాత్, పునీత్ ఇస్సార్ ల పై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో పునీత్ కొట్టిన ఓ దెబ్బ నడుం కింది నాడీ వ్యవస్థకి బలంగా తాకింది. విపరీత మైన నొప్పి రావడంతో వైద్యులు పరీక్షించి వెంటనే శస్త్రచికిత్స చేయాల్సిందే అన్నారు. తరువాత కోమాలోకి వెళ్లారు. కోలుకోవడానికి నెలన్నర పట్టింది. అలా అమితాబ్ పునర్జన్మ ఎత్తారు. ఆతరువాత రెట్టించిన ఉత్సాహంతో కెమెరా ముందుకు వచ్చారు.

Amitabh_Bachchan3సినిమాల్లో పరాజయాలు పలకరించడంతో రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు అమితాబ్. పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వం కాబట్టి ఆయన కూడా భోఫోర్స్ కుంభకోణంలో ఇరుకున్నారు.. దీంతో ఆయన రాజకీయాలకు కూడా రాజీనామా చేశారు. తరువాత వాటి పైపు మొగ్గు చూపలేదు. తరువాత వ్యాపార రంగంలోకి ప్రవేశించి ఏబీసిఎల్ అనే సంస్థను స్థాపించి మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించి విమర్శలను ఎదుర్కొని బాగా నష్టపోయాడు. ఇలా జీవితంలో ఎన్నో ఆటు పోట్లను సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించాడు. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అమితాబ్ కి తెలుగు విశేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles