Veteran actress rajasulochana

Actress Rajasulochana died, Veteran actress Rajasulochana died, actress Rajasulochana death, dancer actress Rajasulochana passed away, Rajasulochana death, actress Rajasulochana images, Rajasulochana death images

Veteran actress and classical dancer Rajasulochana, who starred in Tamil, Telugu, Hindi, Kannada and Malayalam movies in the 50s and 60s, passed away in Chennai on Tuesday morning. She was 78 and had renal problems.

అభినయ తార రాజసులోచన

Posted: 03/06/2013 12:14 PM IST
Veteran actress rajasulochana

raajasulochanaతెలుగు చలనచిత్ర స్వర్ణ యుగానికి చెందిన అలనాటి అందాల తార నృత్యతార చిత్తజల్లు రాజసులోచన  (78) కన్నుమూశారు. హీరోయిన్ గా కాకుండా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి దక్షిణాది ప్రేక్షకుల్ని అలరించింది. ముఖ్యమంత్రులతో లిసి పనిచేశారు రాజసులోచన. అన్నాదురై, కరుణానిధి, జయలలిత, ఎం.జి.ఆర్‌., ఎన్‌.టి.ఆర్‌. తదితరులతో కలిసి నటించారు ఆమె. రాజసులోచన బాల్యం నుంచీ మద్రాసులోనే పెరిగారు. నటిగా రాజసులోచన ఎంతటి ప్రసిద్ధురాలో, నర్తకిగానూ అంతే ప్రఖ్యాతురాలు. కళ్లతో నర్తించి భావాన్ని పండించగల నేర్పు ఉన్న అతి కొద్దిమంది కళాకారిణుల్లో ఆమె ఒకరు. ఆమె సినీ ప్రస్థాన జీవిత ప్రయాణాన్ని ఓసారి గుర్తుకు చేసుకుందాం.

రాజసులోచన భక్తవత్సలం నాయుడు, దేవికమ్మలకు 1934 ఆగస్టు 15న పుట్టిన రాజసులోచన పెరిగినదంతా మద్రాసులోనే. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం విజయవాడ వాస్తస్వులు. ఆచార వ్యవహారాల ఇంట పెరిగిన ఆమెకు  చిన్నతనంలోనే నాట్యం నేర్చుకోవాలన్న తపన బలంగా ఉండేది. సంగీతం అంటే ప్రాణం. ఫిడేలు కూడా నేర్చుకున్నారు. అయినా ఆమెకు నృత్యమంటేనే ఇష్టం. తన పదవ ఏటనుంచే  డాన్స్‌ నేర్చుకోవడం మొదలు పెట్టారు. కొద్ది రోజులు వయొలిన్ చిట్టిబాబు వద్ద ఫిడేలు పాఠాలు నేర్చుకున్నారు. కానీ డాన్స్ లేకపోతే బతకలేననే స్థితికొచ్చారు రాజసులోచన. ఆమెని అర్థం చేసుకున్న పంకజం టీచర్ ఆమె తల్లికి తప్ప మరొకరికి తెలీకుండా సరస్వతీ గాన నిలయంలో డాన్స్ స్టూడెంట్‌గా చేర్పించింది. ప్రసిద్ధ కూచిపూడి నాట్యగురువులు వెంపటి పెద సత్యం, పసుమర్తి కృష్ణ్ణ మూర్తి, చినసత్యం, జగన్నాధ శర్మ మొదలైన వారి వద్ద ఆమె శిక్షణ పొందారు.

భరత నాట్యం, కూచిపూడి, కధక్‌, కథకళి వంటి నాట్యకళలో ఆరితేరారు. తాను నేర్చుకు న్నది చుట్టుపక్కల ఆడపిల్లలకు నేర్పేవారు.ఎక్కడ అవకా శం లభించినా నాట్య ప్రదర్శన లిచ్చేవారు. ఓ డాన్సు ప్రదర్శనలో ఆమెను చూసిన డాన్సర్ రామ్మూర్తి వల్ల గుబ్బి కర్ణాటక ఫిలిమ్స్ నిర్మించిన 'గుణసాగరి ' అనే కన్నడ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. మొదట ఒప్పుకోకపోయినా దాని నిర్మాత గుబ్బి వీరన్న బలవంతం మీద ఒప్పుకున్నారు రాజసులోచన తండ్రి. 1951లో ప్రారంభమైన ఆ సినిమా 1953లో విడుదలైంది. దాని విడుదలకు ముందే ఆ సినిమాని ప్రఖ్యాత తెలుగు దర్శకుడు, నిర్మాత కె.ఎస్. ప్రకాశరావు చూసి, తాను తెలుగు, తమిళ భాషల్లో తీసిన 'కన్నతల్లి' (1953)లో డాన్సర్‌గా ఓ చిన్న వేషం ఇచ్చారు. కన్నడ సినిమా ‘గుణసా గరి ’తో అరంగేట్రం చేసిన ఆమె తమిళ చిత్రం ‘సత్యశోధ నై ’ రెండవ చిత్రం. 1953లో ‘కన్నతల్లి ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి రంగపవ్రేశం చేశారు. ‘సొంత ఊరు ’ చిత్రం నుండి కథానాయకిగా మారారు.

actress rajasulochanaప్రముఖ సినీ దర్శకులు సియస్‌. రావుతో 1963లో వివాహం జరిగింది. ప్రముఖ దర్శకుడు సి.పుల్లయ్య, నటి శాంతకుమారిల కుమారుడే సి.ఎస్‌.రావు. ఇద్దరు కుమార్తెలు, ఒక అబ్బాయి. ఇద్దరు కుమార్తెలూ నాట్యంలో ప్రవేశం ఉన్నవారే కావడం విశేషం. రాజసులోచనకు ' అంతా మనవాళ్లే ', ' చెరపకురా చెడేవు ', ' రేపు నీదే ' చిత్రాల్లో నటించాక గానీ తెలుగులో హీరోయిన్‌గా ఆమెకు అవకాశం రాలేదు. కొన్ని రోజుల తరువాత తెలుగులోని అగ్ర హీరోలందరి సరసనా ఆమె నటించారు. ఓ వైపు హీరోయిన్‌గా చేస్తూనే ఆమె మరోవైపు ' జయభేరి ', ' తోడి కోడళ్లు ' వంటి చిత్రాల్లో వ్యాంప్ రోల్స్, 'మాంగల్యబలం ' వంటి చిత్రాల్లో హాస్య పాత్రలు చేశారు. దాదాపు 300 చిత్రాల్లో నటించారు.  నటిగా ఎన్ని సినిమాలు చేసినా, ఆమెకు మానసికంగా తృప్తినిచ్చింది సినిమాల్లోనూ, బయటా చేసిన నృత్యాలే. అందుకే ఓ వైపు సినిమాల్లో నటిస్తూ పట్టుదలతో కూచిపూడి, కథాకళి, కథక్, భరతనాట్యం, వెస్ట్రన్ డాన్స్‌ని నేర్చుకున్న దీక్షాదక్షురాలు రాజసులోచన. కథక్ నృత్యాన్ని ఇటు లక్నో శైలిలో, అటు జైపురి శైలిలో ఒకేసారి నేర్చుకున్న మొదటి కళాకారిణి ఆమే. నాట్యాన్ని పది మందికీ నేర్పించి ఆ కళకు మహోన్నత స్థానం కల్పించడమే ధ్యేయంగా మద్రాసులో 1962లో పుష్పాంజలి నృత్య కళాకేంద్రాన్ని స్థాపించారు.

తనకున్న కళకు పదును పెట్టి ఆమె ఓ చిత్రానికి డాన్స్ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. 1984లో తమిళనాడు ప్రభుత్వం ఆమెను ' కలైమామణి ' బిరుదుతో సత్కరించింది. అదే కాకుండా ఎన్నో అవార్డులు కూడ అందుకుంది. ఆమె కృషికి తెలుగునాటే సరైన గుర్తింపు దక్కలేదని చెప్పాలి. ఆ చక్కదనాల చుక్క చడీచప్పుడు చేయకుండా పంచభూతాల్లో కలిసిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles