భారత జాతీయ సాంఘీకోద్యమ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్‌కి విశిష్టమైన స్థానం ఉంది. భారత రాజ్యంగ నిర్మాతగా ఆయన చేసిన ృషి అభినందనీయం. మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపు మాపి సర్వసమానత్వం కొరకు క్రుషి చేసిన కారణజన్ముడు అంబేద్కర్. అస్పృశ్య తా నిర్మూలనలను ఒక మహోద్య మాన్నిగా నిర్వహించి, దేశవ్యాప్తం గా దళితులలో సాంఘిక,రాజకీయ, విద్యా చైతన్యాన్ని కలిగించిన ఘనత ఒకే ఒక వ్యక్తికి దక్కింది. ఆయనే డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్. భీం రావ్ రాంజీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ లోని మోవ్ గ్రామంలో మహర్ అనే హరిజన తెగలో రామ్‌జీ మాలోజీ సక్పాల్, భీమాబాయి దంపతులకు భీమ్‌రావు జన్మించారు.
భీమ్‌రావు సతారాలో చదువుకునే వయసులోనే అస్పృశ్యత, అంటరానితనం పట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించేవారు. భీమ్‌రావు అనేక అవమానాలకు గురయ్యారు. ఒకసారి మంగలి వద్దకు వెళ్ళి తనకు జుట్టు కత్తిరించమని అడిగితే, తన కత్తెర మైలపడుతుందని చీదరించుకున్న క్షురకుడే, బర్రె దూడల వెంట్రుకల్ని కత్తిరించడం చూశారు భీమ్‌రావు. చిన్నతనం నుంచి ఇటువంటి అవమానాలెన్నింటినో చవిచూశారాయన. భీమ్‌రావు అటువంటివి అక్కడక్కడే వదిలివేసి, తన లక్ష్యసాధన విద్యతో ఉన్నతిని సాధించాలనుకున్నారు. భీమ్‌రావుకి సంస్కృతం నేర్చుకోవాలనే అభిలాష ఉండేది. కానీ మహర్ కులస్థుడు కావడం వల్ల అనుమతి లభించలేదు (ఆ తరువాతి రోజుల్లో సంస్కృతాన్ని అధ్యయనం చేసి, ఒక జర్మన్ విశ్వవిద్యాలయంలో సంస్కృతం బోధించే స్థాయికి ఎదిగాడు).
భీమ్‌రావులోని చురుకుతనం, సహనం, పట్టుదల మేధావితనం (చిన్నతనంలోనే) చూసి, ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అయిన అంబేద్కర్ అనే ఆయన అతనిని (భీమ్‌రావుని) ప్రేమతో, వాత్సల్యంతో చూసేవాడు. భీమ్‌రావులో ఆత్మస్థయిర్యాన్ని నింపి, ఉన్నతస్థాయికి ఎదిగేలా సహాయం చేశాడాయన. ఆయన పట్ల గౌరవభావంతోనే తన పేరుతో ‘అంబేద్కర్’ పేరును లీనం చేసుకొని గురుభక్తిని చాటుకొన్నారు భీమ్‌రావు. అప్పటినుంచి భీమ్‌రావు పేరుగా కాకుండా అంబేద్కర్‌గా కోట్లాది ప్రజల హృదయాలలో చోటుచేసుకున్నారు. బీఏ పాస్ అయిన తరువాత ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం వున్నప్పటికీ, బ్రిటిష్ ప్రభుత్వానికి ఊడిగం చేయలేనని, దేశభక్తిని చాటుకొని బరోడా సంస్థానం లో చేరారు. తోటి ఉద్యోగుల నుంచి అవమానాల్ని ఎదుర్కొన్నారు అంబేద్కర్. అయితే వాటిని లెక్క చేయలేదు. అంబేద్కర్‌లోని కార్యదక్షతను, ఉన్నత చదువులు చదవాలనే ఆసక్తిని గమనించి బరోడా మహారాజు అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీకి పంపడం ఆయన జీవితంలో మరొక అధ్యాయంగా చెప్పవచ్చు.
అమెరికాలో ఉండగానే నిరాడంబర జీవనశైలిని అలవరచుకున్నారు అంబేద్కర్. తదేకదీక్షతో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు అంబేద్కర్. తనకున్న మేధా సంపత్తితో విదేశాలలోనే స్థిరపడిపోయే అవకాశం ఉన్నప్పటికీ, స్వదేశం మీద ప్రేమతో హిందూసమాజాన్ని సంస్కరించాలనే ఆకాంక్షతో అన్నిరకాల అవమానాలను ఆత్మస్థయిర్యంతో ఎదుర్కోవడానికి సిద్ధపడి దేశానికి తిరిగి వచ్చిన నిజమైన దేశభక్తుడు డాక్టర్ అంబేద్కర్. దేశానికి తిరిగి వచ్చాక కూడా తను అనేక అవమానాలకు గురయ్యారు.
1927 డిసెంబర్‌లో మహర్ పట్టణంలోని చౌదర్ చెరువులో అస్పృశ్యులు నీళ్ళు తాగడాన్ని నిషేధించారు. దీనితో డాక్టర్ అంబేద్కర్ దళితులతో కలిసి ఉద్యమం చేపట్టారు.స్వరాజ్యమే లక్ష్యంగా ఎంచుకుని దాని సాధనకు పోరాడాలని 1930 ఆగస్టు 8న నాగపూర్‌లో జరిగిన నిమ్నవర్గాల కాంగ్రెస్ మొదటిసభకు అధ్యక్షత వహిస్తూ డాక్టర్ అంబేద్కర్ పిలుపుని చ్చారు. ఆ విధమైన అంబేద్కర్ గర్జనకు ఇటు బ్రిటిష్ పాలకులు, అటు కాంగ్రెస్‌లోని చాందసవాదులకు దడపుట్టింది. దానికి కారణం అంబేద్కర్ ఒక వర్గానికి నాయకుడని, దేశద్రోహి అని కొంతమంది ప్రచారం చేస్తున్న రోజులవి. కానీ అటువంటి నిందా రోపణలకు భయపడకుండా, దళితులలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ, మరోవైపు దేశ ప్రయోజనాలను కాపాడుతూ దళితులలో దేశభక్తిని పెంచి పోషించిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more