కొంతమంది మనుషులు ప్రపంచం మొత్తానికి చెందుతారు.వారు తమ జీవితకాలంలో ఏదో ఒక రూపంలో మొత్తం మనిషి మనుగడనే ప్రభావితం చేసి ఉంటారు. మానవ చరిత్రలో వారి జీవితాన్ని మినహాయిస్తే, ఎవరూ పూరించలేని లోటు ఒకటి అలాగే కలకాలం ఉండిపోయేది- అని ప్రపంచమంతా నమ్మే మహనీయులు వాళ్లు. అలాంటి వ్యక్తే నెల్సన్ మండేలా. నల్లజాతి సూరీడుగా ఆయన దక్షిణాఫ్రికా ప్రజల గుండెల్లో నిలవడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా శాంతి ఆరాధకులకు ఆరాధ్యుడయ్యారు. ప్రపంచంలో ఏ మూల జాతి వివక్ష, అణచివేత తలెత్తినా నెల్సన్ మండేలా పోరాట పంథాయే అంతిమ తీర్పుగా మిగులుతుంది అనడంలో సందేహం లేదు.
చరిత్ర పుటల్లో జూన్ 12, 1964 ఆ తీర్పు కొందరు వ్యక్తుల స్వాతంత్రయ పిపాసను 27 ఏళ్లపాటు జైలుగోడల్లో మగ్గేలా చేసింది. సమకాలీన ప్రపంచ చరిత్రలో ఒక ఆదర్శం కోసం, జాతి వివక్షత లేని సమాజం కోసం కలగన్న వారి పాతికేళ్ల జీవితాన్ని నిలువునా హరించిన క్రూరమైన తీర్పు అది. నాజీ నరహంతకులను మినహాయిస్తే, రాజకీయ స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతలకు యావజ్జీవ శిక్ష విధించి అమలు చేసిన అరుదైన చరిత్రకు ఆ తీర్పు సాక్షిగా నిలిచిపోయింది.
కుట్ర, దేశద్రోహ ఆరోపణలతో ఒక తెల్లజాతి న్యాయమూర్తి నెల్సన్ మండేలాకు, మరో ఏడుగురు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నేతలకు 1964 జూన్ 12న యావజ్జీవ శిక్ష విధించాడు. సరిగ్గా 49 ఏళ్ల తర్వాత తమ తాతకు దక్షిణాఫ్రికా జాతి ఇస్తున్న మద్దతుకు గాను మండేలా మునిమనవడు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ నాడు డిఫెన్స్ కేసు ప్రారంభంలో మండేలా తననుతాను సమర్థించు కుంటూ చేసిన ప్రసంగం దక్షిణాఫ్రికా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపో యింది. మిలార్డ్, నా జీవితాన్ని ఆఫ్రికా ప్రజల పోరాటానికే అంకితం చేస్తూ వచ్చాను. శ్వేత జాతి ఆధిక్యతపై పోరాడాను. అదేసమయంలో నల్లజాతి ఆధిపత్యంపై కూడా పోరాడాను.
ప్రజలందరూ సామరస్య భావంతో, సమాన అవకాశాలతో జీవించే ప్రజాస్వామిక, స్వేచ్ఛా సమాజ ఆదర్శాలతో పెరుగుతూ వచ్చాను. ఈ ఆదర్శాన్ని సాకారం చేసేందు కోస మే నేను జీవిస్తున్నాను. మిలార్డ్, అవసరమైతే ఈ ఆదర్శం కోసం నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. విచారణ అనంతరం ప్యాలెస్ జస్టిస్ అనబడే ఆ న్యాయ మందిరంలో న్యాయమూర్తి డి వెట్ తీర్పు చదివి వినిపిం చారు. ఈ ఎనిమిదిమంది వ్యక్తులు తీవ్ర ద్రోహానికి తలపెట్టారని చెబుతూనే, జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత వీరికి మరణశిక్ష విధించ కూడదని తాను నిర్ణయించినట్లు చెప్పారు. తీర్పు వివరాలు తెలియగానే కోర్టుబయట వేచి ఉన్నవారిలో పెద్దగా నిట్టూర్పు.
తమ నేతలకు మరణశిక్ష పడలేదనే కాస్త ఊరట ఆ నిట్టూర్పుకు అర్థం. ఆ నిట్టూర్పు వెనుక తమ ప్రియతమ నేతలకు ఉరిపడలేదనే ఆనందమే ఉండొచ్చు కాని 27 ఏళ్లు సుదీర్ఘకాలం వారు కారాగారంలో మగ్గిపోనున్నారని ఆనాడు ఎవ్వరూ ఊహించలేదు. శిక్ష పడిన వెంటనే మండేలాను, మరో ఆరుగురిని పేరుమోసిన రాబిన్ ఐలండ్ జైలుకు తరలించారు. 27 ఏళ్ల తర్వాతే మండేలాకు తదితరులకు విముక్తి లభించింది.
జాతికి క్షమాగుణం నేర్పినవాడు
నల్లజాతికి క్షమాగుణం విలువ నేర్పినవాడిగా కూడా మండేలా చరిత్రలో నిలిచిపోయాడు. దశాబ్దాలుగా తమను నీచంగా అణిచిపెట్టిన తెల్లజాతి దురహంకారులపై సాధారణ నల్లజాతి ప్రజలకు ఉన్న ద్వేషభావాన్ని తగ్గించడంలో నెల్సన్ తన వ్యక్తిత్వంతో చూపిన ప్రభావానికి రాబిన్ ఐలండ్ జైలు ఓ మచ్చుతునక. తన 27 సంవత్సరాల జైలు జీవితంలో 18 ఏళ్ల పాటు మండేలా రాబిన్ ఐలండ్ జైలులోనే గడిపారు. జాతి వివక్షతా పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత మండేలా దేశాధ్యక్షుడి గా అయినవిధంగానే రాబిన్ ఐలండ్ జైలులో ఆయనతో పాటు జైలు శిక్ష గడిపిన అనేకమంది నల్లవారు ఆదే జైలుకు తదనంతర కాలంలో అధికారులయ్యారు. తరాలు గడిచేకొద్దీ వారే తెల్లవారిపై ఆధిపత్య స్థానాల్లోకి వచ్చేశారు.
ఈ తెల్లవాళ్లు అదే జైలులో జాతి వివక్ష అమలైన కాలంలో జైలు గార్డులుగా ఉండేవారు. తరం మారాక అధికారులుగా మారిన నల్ల అధికారులలో చాలామంది గతంలో ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో తెల్లజాతి దురహంకార పాలన నశించాలని కోరుకుంటూ వారిపట్ల తీవ్ర ద్వేషంతో వ్యవహరించేవారు. కానీ వాళ్లిప్పుడు మారిపోయారు. ఎందుకంటే వారు తమ నాయకుడు మండేలా నుంచి నెర్చుకున్నారు. మండేలా లాగే వాళ్లు కూడా తమ మాజీ పీడకులను క్షమించేశారు. కాని ఇప్పుడు నల్లవాళ్లందరూ మండేలా స్థాయి దాతృత్వం, జ్ఞానం కలిగిన వారుగా ఉండకపోవచ్చు.
కాని ఒక స్వాతంత్రయ యోధుడు, తదనంతర కాలంలో విముక్తి పొందిన దేశానికి అధ్యక్షుడయిన వాడు, 20వ శతాబ్ది దిగ్గజాలలో ఒకడిగా ఎలా అయ్యాడో తెలుసుకోవాలంటే రాబిన్ ఐలండ్ పరివర్తనా గాథే నిలువెత్తు సాక్షిగా నిలుస్తుంది. అవును మండేలా ఏలిన రాజ్యంలో నల్లవారు తమ ప్రత్యర్థులను, ఒకనాటి ఆగర్భ శత్రువులను క్షమించేశారు. దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రజాస్వామిక పరివర్తనకు మండేలా నిర్దేశించిన సూత్రాలే కారణం అని శ్వేత ప్రజలు కూడా కొనియాడుతున్నారంటే ఆఫ్రికా ఖండంపై మండేలా ముద్ర ఏమిటో సులువుగానే బోధపడుతుంది. నిజమే. ఒక జాతికి క్షమించడం నేర్పినవాడికి జీవితంలో అంతకంటే సాధించవలసింది ఏముంది మండేలా వారసత్వం యుగయు గాల వరకు చిరస్థాయిగా నిలుస్తుందనడం నిజంగానే అక్షరసత్యం.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more