Gurujada appa rao

mahakavi sri gurajada apparao, gurajada venkata apparao, gurajada apparao was a social reformer, gurajada appa rao songs, gurajada apparao was a   writer and philosopher

mahakavi sri gurajada apparao

తెలుగువారి అడుగు జాడ గురజాడ

Posted: 01/20/2014 12:38 PM IST
Gurujada appa rao

(Image source from: తెలుగువారి అడుగు జాడ గురజాడ)

మన తెలుగు నేలపై ఎందరోసంఘ సంస్కర్తలు జన్మించారు. అవారిలో గురజాడవారిని అగ్రగణ్యునిగా చెప్పవచ్చు. కవి, రచయిత, అభ్యుదయవాదిగా గురజాడ ఎన్నో సామాజిక సేవాకార్య క్రమాలు చేపట్టారు. మొదలి తెలుగు నాటకం కన్యాశుల్కం రచించిన ఘనత ఈయనకు దక్కుతుంది. గురజాడ అప్పారావు 1861లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జి్ల్లా యలమంచిలిలో జన్మించారు. వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించిన గురజాడవారు తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. గురజాడ అప్పారావు తండ్రి వెంకటరామదాసు పేష్కార్ గా, రెవెన్యూ సూపర్ వైజర్ గా విజయనగరం సంస్థానంలో పనిచేశారు. అతను మంచి విద్యావేత్తేకాక సంసంస్క్రత భాషపై మంచి పట్టున్న వ్యక్తి. అనంతర కాలంలో ఈయన చిన్న నది దాటుతున్న సమయంలో ప్రమాదానికి గురై మరణించారు.

 

గురజాడ అప్పారావు చాలాకాలం విజయనగరంలోనే నివశించారు. ఆసమయంలో ఈ ప్రాంతాన్నిక ళింగ రాజ్యంగా పిలిచేవారు. ఈయన 10 తరగతి వరకూ చీపురుపల్లిలోనే చదువుకున్నారు. తండ్రి అక్కడ ఉద్యోగం చేస్తుండడంతో గురజాడవారి విద్యాభ్యాసం అక్కడ కొనసాగింది. తండ్రి మరణానంతరం అప్పారావు తన చదువును విజయనగరంలో కొనసాగించారు. ఈ సమయంలో ఆయన అతని బంధువుల ఇంట్లో వారాలబ్బాయిగా కొనసాగారు. అప్పటి ఎంఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ సి చంద్రశేఖరరావు గురుజాడ విద్యాబ్యాసానికి ఎంతో సాయమందించేవారు. అతనికి ఉచిత వసతి , భోజన సదుపాయాలను కల్పించారు. గురజాడ మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన అనంతరం ఎంఆర్ హైస్కూలులో ఉపాధ్యాయునిగా 1884లో చేరారు. 1887లో గురజాడ విజయనగరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో మాట్లాడారు. అతనికి 1887లో కూతురు జన్మించింది. 1885 నుంచి గురజాడ అప్పారావు విశాఖపట్నం కేంద్రంగా అనేక సామా.జిక సేవాకార్యక్రమాలను ప్రారంభించారు. 1989లో ఆనందగజపతి డిబేటింగ్ క్లబ్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అనంతరం అతనికి 1890లో గురజాడకు వెంకట రామదాసు పుట్టాడు. 1891లె లెక్చరర్ గా ప్రమోట్ అయ్యారు. దీంతో బిఎ విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్, సంస్క్రతం, ట్రాన్స్ లేషన్, గ్రకు , రోమన్ చరిత్రలు పాఠ్యాంశాలుగా బోధించసాగారు. గురజాడ అప్పారావు సోదరుడు శ్యామలరావు మంచి రచయితగా గుర్తింపు పొందారు. తెలుగు భషకు వన్నె తెచ్చేందుకు గురజాడ వారు ఎనలేని క్రుషి చేశారు. 1892లో గురజాడ ప్రదర్శించిన కన్యాశుల్కం నాటకానికి ఎనలేని ప్రసంశలు దక్కాయి. ఈ నటకంలోని అంశం అప్పట్లో విప్లవాన్ని తీసుకువచ్చింది. దీంతో గురజాడ తన సామాజిక కార్యక్రమాలను మరింతగా పెంచారు. 1910 ఇతను రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే గీతం ఎంతో ప్రజాదరణ పొందింది. దేశం కేవలం భూమితో మాత్రమే ఏర్పడినది కాదని మానవజాతితో కూడినదని ఈ గీతంలో గురజాడ వారు వివరించారు. 1896లో అప్పారావు ప్రాక్ శిక్షలనే పత్రికలను వెలువరించారు. 1897లో కన్యాశుల్కానిక ముద్రణా రూపం తీసుకువచ్చారు. దీనిని మహారాజా ఆనంద గజపతికి అంకితం చేశారు. అనంతరం ఆనందగజపతి గురజాడను మహారాణి రీవాకు పర్సనల్ సెక్రటరీగా నియమించారు. 1908లో జరిగిన మద్రాస్ కాంగ్రెస్ మహా సభలకు గురజాడవారు హాజరయ్యారు. తరువాతి కాలంలో కొన్ని అనారోగ్య కారణాల తో ఆయన నీలగిరి హిల్స్ లో గడిపారు.

 

1909లో కన్యాశుల్కం ద్వితీయ ముద్రణను తీసుకువచ్చారు. ఈ సమయంలోనే గురజాడ వారు సాంఘిక మార్పును ఆకాంక్షిస్తూ అనేక రచనలు చేశారు. 1091లో మద్రాసు యూనివర్శిటీలో గౌరవ మొంబర్ గా చేరారు. అదే సంవత్సరంలో తనమిత్రుల సాయంలో ఆంద్ర సాహిత్య పరిషత్ ను నెలకొల్పారు. 1913లో రిటైర్ అయిన గురజాడ తన జీవితాంతం నిడారంబరంగానే గడిపారు. గురజాడ చేపట్టిన సాంఘికోద్యమంలో కన్యాశుల్కం ప్రధాన ప్రాత్ర వహించిందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. 1925లో గురజాడ అప్పారా వు కన్నుమూశారు. తెలుగు జాతికి ఎనలేని సేవలందించిన గురజాడ సదా చిరస్మరణీయుడు

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles