Bls prakash rao biography who got prestigious bhatnagar reward

bls prakash rao news, bls prakash rao history, bls prakash rao life history, bls prakash rao biography, bls prakash rao life story, bls prakash rao awards, bls prakash rao photos, bls prakash rao achievements, bhatnagar title, andhra pradesh government, bls prakash rao maths scientist, mathematics scientits in andhra pradesh

bls prakash rao biography who got Prestigious bhatnagar reward

గణితంలో ఘనాపాటిగా పేరొందిన ‘‘భట్నాగర్’’ ప్రకాష్!

Posted: 10/09/2014 05:54 PM IST
Bls prakash rao biography who got prestigious bhatnagar reward

సాంకేతిక రంగంలో దూసుకుపోతున్న మన భారత్ లో ఇప్పటికీ యువతరం గణితం అంటే భయపడి పక్కనపెడుతుంటే.. దేశం ఇంకా సరిగ్గా అభివృద్ది చెందని కాలంలోనే గణితంలో ఘనాపాటిగా పేరొందిన ఎందరో ఆచార్యులు వున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బి.ఎల్.ఎస్.ప్రకాశ్ రావు ఒకరు. ఇతర విద్యార్థుల్లాగా ఏదో చదువుకుని ఒక సామాన్యమైన ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని గడుపుదామని భావించకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించాలనే ఆకాంక్షతో ప్రకాష్ గణితంలో రికార్డు నమోదు చేసుకున్నారు. దీంతో ఈయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఈయనను గణతీయ శాస్త్రాలలో అత్యున్నత పురస్కారం అయిన భట్నాగర్ తో పురస్కరించింది.

జీవిత చరిత్ర :

1942 అక్టోబర్ 6వ తేదీన కడప జిల్లాలోని పోరుమామిళ్లలో ప్రకాష్ రావు జన్మించారు. ఈయన పూర్తి పేరు భాగవతుల లక్ష్మీ సూర్యప్రకాశరావు. చిన్నతనం నుంచి విద్యారంగంలో బాగా రాణించిన ఈయన.. విశాఖపట్టణంలోని ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో బీ.ఏ.ఆనర్స్ (1957-1960) గణితంలో సుమారు 92 శాతం మార్కులు సాధించి సరికొత్త రికార్డును నమోదు చేశారు. అనంతరం ఆయన కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో ఎం.స్టాట్ చదివి... అక్కడ నుంచి నేరుగా అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ (ఈస్ట్ లాన్సింగ్)లో 1966లో పి.హెచ్ డి. చేశారు. ఇలా ఈ విధంగా గణితంలో అత్యున్నత విద్యనభ్యసించిన ఈయన.. పాశ్చాత్త దేశాల్లో సైతం అనేక విశ్వవిద్యాలయాల్లో వివిభ బోధన పదవులను అధిష్టించారు.

అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (బెర్కిలీ), ఇల్లినాయ్ విశ్వవిద్యాలయం (అర్బానా), పర్డ్యూ విశ్వవిద్యాలయం, విస్కాన్ సన్ విశ్వవిద్యాలయం (మాడిసన్), కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (డేవిస్), అయోవా విశ్వవిద్యాలయం (అయోవా సిటీ), కెనడాలోని మాంట్రియల్ విశ్వవిద్యాలయం... ఇలా తదితర అనేక విద్యాలయాల్లో ఆయన వివిధ బోధన పదవులను అధిష్టించారు. అలాగే సంభావ్యతావాదం, గణాంకశాస్త్రాలలో ఉత్తమమైన పరిశోధనలను చేసి, అందుకు తగిన గుర్తింపును పొందిన గణితశాస్త్రజ్ఞుడు ప్రకాష్ రావు. ఆయన చేసిన పరిశోధనలకు గుర్తింపుగా మిచిగన్ స్టేట్ విశ్వవిద్యాలయం విశిష్ట పూర్వవిద్యార్థిగా ఆయన్ను గౌరవించింది. ఇక బారతదేశం విషయానికొస్తే.. ప్రకాష్ రావు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాన్పూరు), ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (కొత్తఢిల్లీ), ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (కోల్ కత్తా)లలో ఆచార్య పదవిని అధిష్టించడంతోపాటు... ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యుట్ (కలకత్తా)కు డైరక్టరుగా బాధ్యతలు స్వీకరించి, దానికి దిశానిర్దేశంచేశారు కూడా!

ఇలా ఈ విధంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో గణాంకశాస్త్రజ్ఞుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించిన ప్రకాష్ రావు.. ఎన్నో బిరుదులు - పురస్కారాలను అందుకోగలిగారు. 1982లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ‘‘భట్నాగర్’’ పురస్కారాన్ని (గణితీయ శాస్త్రాలలో) పొందారు. పరమ విశిష్ట శాస్త్రజ్ఞుడుగా గుర్తింపపొందారు. సుమారు రెండు వందల పరిశోధన పత్రాలను, ఎన్నో శాస్త్రీయగ్రంథాలను ప్రకటించిన ఈయనను... విశిష్ట ఆచార్యుడుగా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ గౌరవించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles