The telugu famous comedian rajababu biography

comedian rajababu biography, rajababu news, rajababu life history, rajababu life story, rajababu career, rajababu wikipedia, rajababu photos, rajababu movies, rajababu latest news, rajababu vardhanthi, rajababu birthday special

the telugu famous comedian rajababu biography who is worked for 20 years in film industry

‘‘శతాబ్దపు హాస్య నటుడి’’గా గుర్తింపు తెచ్చుకున్న రాజబాబు!

Posted: 10/21/2014 03:35 PM IST
The telugu famous comedian rajababu biography

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడాలేని విధంగా కేవలం తెలుగు పరిశ్రమలోనే ఎందరో హాస్యనటులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించి.. గొప్ప హాస్యనటులుగా ఎదిగారు. అటువంటివారిలో రాజబాబు కూడా ఒకరు. తెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాలు ప్రముఖ హాస్యనటునిగా వెలిగిన రాజబాబు ‘‘శతాబ్దపు హాస్య నటుడి’’గా ప్రసంశలు అందుకొన్న గొప్ప వ్యక్తి. అంతేకాదు... ఏవిధంగా అయితే సినిమాల్లో నటించి ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వించాడో.. అదేవిధంగా నిజజీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవాడు. ఎంతోమంది జీవనాశ్రయం కల్పించిన ఈయన.. ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.

జీవిత చరిత్ర :

1935 అక్టోబరు 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో రాజబాబు జన్మించారు. ఈయన పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు - శ్రీమతి రవణమ్మ. ఈయన నిడదవోలులోని పాఠశాలలో చదువుతూనే ‘‘బుర్రకథ’’ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర చేరాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించికుని... కొన్నాళ్లపాటు తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. ఆ సమయంలోనే నాటకలలో కూడా పాలుపంచుకొనేవాడు. అనంతరం 1965 డిసెంబరు 5వ తేదీన లక్ష్మీ అమ్ములుతో వివాహమాడాడు. వారికి నాగేంద్రబాబు, మహేశ్ బాబు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు.

ఉపాధ్యాయునిగా కొనసాగుతున్న నేపథ్యంలోనే నాటకాల్లో పాలుపంచుకొంటున్న నేపథ్యంలో.. ఒకనాడు నాటకంలో రాజబాబును చూసిన గరికపాటి రాజారావు (పుట్టిల్లు సినిమా దర్శకుడు) చిత్రపరిశ్రమలోకి రావాల్సిందిగా ఉత్సాహపరిచారు. అంతే.. ఆ ఉత్సాహంతోనే ఎవరికీ చెప్పాపెట్టకుండా 1960 ఫిబ్రవరి 7వ తేదీన మద్రాసు చేరుకొన్నాడు. అక్కడికి వెళ్లిన మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదురైనా.. వెనుదిరగకుండా కష్టాలను అనుభవిస్తూ అడుగులు వేశారు. ఆ సమయంలోనే ఆయనకు
హాస్యనటుడు అడ్డాల నారాయణరావుతో పరిచయమైంది. ఆయన కూడా తన పూట గడవడానికి  పిల్లలకు ప్రైవేటు చెప్పేవాడు. అయితే కొన్నాళ్ళ తరువాత ఆయన రాజబాబుకి సమాజం సినిమాలో అవకాశం కల్పించాడు. ఇక అప్పటినుంచి తన హాస్యప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాజబాబుకి వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే రెండు - మూడు సినిమాల అనంతరం ఆయన ‘‘స్వర్ణగౌరి’’ చిత్రానికిగాను రూ. 350ల మొదటి పారితోషికాన్ని స్వీకరించాడు.

ఆ తర్వాత వీ.బీ.రాజేంద్రప్రసాద్ తీసిన ‘‘అంతస్తులు’’ చ్రిత్రంలో నటించినందుకుగాను రూ. 1300 పెద్దమొత్తాన్ని పారితోషికంగా పొందాడు. అప్పటికే ఆయనకు చిత్రపరిశ్రమలో ఒక మంచి నటుడిగా పేరు కూడా వచ్చేసింది. దాంతో వరుసగా ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆయనను తమ చిత్రాల్లో నటించాల్సిందిగా అవకాశాలు ఇచ్చాయి. ఆ సమయంలో ఎన్నో చిత్రాల్లో నటించారు. ఎంతోమంది తారలు ఈయనకు జోడిగా నటించారు. అయితే అందరిలోనూ ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం రమాప్రభ అని చెప్పాలి. ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్, ఇల్లు ఇల్లాలు, పల్లెటూరి బావ, సెక్రెటరి, జీవన జ్యోతి, కార్తీక దీపం, అడవి రాముడు, సోగ్గాడు లాంటి చిత్రాలు రాజబాబు-రమాప్రభ జోడీకి మంచి హాస్య జంటగా పేరు తెచ్చాయి.

చిత్రపరిశ్రమలో ఈయన అందించిన సేవలకు ఎన్నో అవార్డులు - సత్కారాలు లభించాయి. వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడిగా ఈయన పేరు తెచ్చుకున్నాడు. ఆయన జీవితంలో మొత్తం తొమ్మిది ఫిలింమ్ ఫేర్ అవార్డులు, మూడు నంది బహుమతులు, ఇంకా ఎన్నెన్నో అవార్డులు రివార్డులూ పొందాడు. ‘‘చెన్నై ఆంధ్రా క్లబ్బు’’వారు వరుసగా ఐదు సంవత్సరాలు ‘‘రోలింగ్ షీల్డు’’ని ప్రధానం చేసారు. ఇదిలావుండగా.. ఏవిధంగా అయితే రాజబాబు తన ప్రతిభతో ప్రేక్షకులను నవ్వించాడో.. అదేవిధంగా నిజజీవితంలోనూ గొప్ప మనస్సుగల వ్యక్తిగా పేరు సాధించాడు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని, నటీమణుల్ని సత్కరించేవాడు. అంతేకాదు.. ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలిచ్చిన దాత రాజబాబు. రాజమండ్రిలో చెత్తాచెదారం శుభ్రపరిచే వాళ్ళకు అదే ఊరిలో భూమి ఇచ్చాడు. కోరుకొండలో ఒక జూనియర్ కాలేజీ కట్టించాడు.

మరణం :

ఘంటసాల వర్ధంతిరోజునే మహా శివరాత్రినాడు (ఫిబ్రవరి 11) మొత్తం ఘంటసాల పాటలు వింటూనే వుండిపోయారు. అదే రోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాదులోని థెరెసా ఆసుపత్రిలో చేరాడు. ఆ ఆసుపత్రిలోనే ఫిబ్రవరి 14, 1983 రోజున తుదిశ్వాస విడిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles