తెలుగు చలనచిత్రపరిశ్రమలో ఇప్పటివరకు ఎందరో హాస్యనటులు ప్రేక్షకులను బాగానే నవ్వించారు.. కానీ అందులో కేవలం కొంతమంది మాత్రమే చిరస్మరణీయంగా నిలిచిపోయారు. అటువంటివారిలో ఎస్.వి.సుబ్రహ్యణ్యం ఒకరు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన.. అనుకోకుండా వచ్చిన ఒక్క ఆఫర్ నుంచి తన నటనాప్రతిభను నిరూపించకుని గొప్ప హాస్యనటుడిగా ఎదిగారు. దాదాపు 450కు పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అంతేకాదు.. ఈయన కొన్ని సినిమాలకు కథలు కూడా రాశారు. ఒక నిర్మాతగా, దర్శకుడిగా తన మెగాఫోన్లు చేపట్టారు. ఇక రాజకీయరంగంలోనూ తనదైన పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేశారు.
జీవిత చరిత్రం :
1957 జనవరి 2వతేదీన గుంటూరు జిల్లా తెనాలిలో నివాసమున్న వీర రాఘవయ్య, శివ కామేశ్వరి దంపతులకు సుబ్రమణ్యం జన్మించారు. ప్రాథమిక విద్యానంతరం వీఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. ఆ కాలేజీ రోజుల్లోనే ఈయన రంగస్థల ప్రవేశం చేశారు. కళాశాల లెక్చరర్ నఫీజుద్దీన్ రాసిన నాటకాల్లో ఈయన నటిస్తుండేవారు. తర్వాత మిమిక్రీ కళాకారునిగా, పత్రికారంగంలో జర్నలిస్టుగా పేరు సంపాదించుకున్నారు. అయితే నాటకాలలో ఈయనకు ఎక్కువ మక్కువ వుండేది. అందుకే లలిత కళా సమాఖ్య పేరిట పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల సహకారంతో చిత్ర పరిశ్రమ, కళారంగంలోని మహామహులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసి సత్కారాలు, సన్మానాలు నిర్వహిస్తుండేవారు. శారద కళాపీఠం, నాగకళామందిర్ వంటి విఖ్యాత సంస్థలతో పలు నాటక ప్రదర్శనలు ఇప్పించారు.
సినిమా జీవితం :
మొదట తెనాలిలో ఉదయం పత్రికలో రిపోర్టరుగా చేరిన ఆయన... ఆ తరువాత ఒంగోలులో స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు. విజయవాడలో ఆంధ్రజ్యోతి పత్రికలో సబ్ ఎడిటర్‌గా, ఇన్చార్జిగా పనిచేశారు. ఈ దశలోనే ఆయన చిత్ర పరిశ్రమకు వెళ్లారు. అదే ఆయనకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ క్రమంలో పరిచయమైన దర్శకుడు బాపు ఆయనకు ‘‘మిస్టర్ పెళ్ళాం’’ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. మొదటి సినిమాతోనే రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు. అంతే! ఇక అప్పటినుంచి ఆయన వెనుదిరిగి చూడకుండా సినిమాల్లో కంటిన్యూ అయిపోయారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గొప్ప హాస్యనటుడిగా పేరుగాంచారు.
రంగస్థల నటునిగా, మిమిక్రీ కళాకారునిగా తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన ఏవీఎస్.. కొత్త కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. వివేకా విద్యా సంస్థలు, గ్లోబల్ ఆసుపత్రితో కలిసి రెండుసార్లు మెగా వైద్య శిబిరాలు నిర్వహించి వేలాది మందికి ఉచిత వైద్య సేవలు అందచేశారు. పట్టణంలో ఓపెన్ ఆడిటోరియం నిర్మించాలని కలలు కన్నారు. ‘‘తుత్తి’’ మ్యానరిజం చేసినా, ఘటోత్కచుడు సినిమాలో ‘‘రంగుపడుద్ది’’, శుభలగ్నం సినిమాలో ‘‘గాలి కనపడుతుందా’’వంటి డైలాగులతో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 19 ఏళ్లలో సినీ కెరీర్ లో ఏవీఎస్ 500 చిత్రాల్లో నటించి... హాస్యనటుడిగా గొప్ప పేరు సాధించారు. అంతేకాదు... ‘‘అంకుల్’’ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారారు. అలాగే ‘‘సూపర్ హీరోస్’’ చిత్రం ద్వారా దర్శకుడుగా మారిన ఆయన.. నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. పౌరాణిక సినిమాల్లో శకుని, నారదుని పాత్రల్లోనూ నటించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు.
ఇదిలావుండగా.. 2008లో ఆయన కాలేయ సమస్యతో కొన్నాళ్లవరకు ఆసుపత్రిలోనే చికిత్సం పొందాల్సి వచ్చింది. అయితే కాలేయం పూర్తిగా దెబ్బతిన్న కారణంగా ఆయన ప్రాణానికి ప్రమాదముందని డాక్టర్లు చెప్పడంతో ఆయన కుమార్తె తన కాలేయాన్ని దానం చేసింది. అనంతరం కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. దాంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడి తిరిగి కోలుకుని, పలు చిత్రాల్లో నటించారు. అయితే కాలేయం వ్యాధి మళ్ళీ ముదరడంతో మణికొండలోని తన కుమారుడు ప్రదీప్ నివాసంలో 2013, నవంబరు 8వ తేదీ రాత్రి కన్ను మూశారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more