మాలోని నిశ్యబ్ద భావాలు నిన్ను అనుక్షణం గుర్తుచేస్తూ నీ చరిత్ర పుటలను తిరగేస్తున్నాయి....
మొట్ట మొదట నీ జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు అదే ప్రపంచ భావి పౌరులకు తొలి మెట్టుగా బీజం పడబోతుంది
ప్రపంచంలోని మలినాలన్నిటిని కడిగేసావు...
ఈ ప్రపంచానికి మనిషి విలువేంటో తెలియజేసావు...
పేద ప్రజల గుండెల్లో నీ జ్ఞాపకాలు చిరస్మరణీయం.
ఇప్పటికి నువ్వు లేవని మా కళ్ళలో తిరుగుతున్న కన్నీళ్లు...
ఆ కన్నీళ్లను కసిగా మలిచి నువ్వు ఈ లోకానికి ఇచ్చిన స్ఫూర్తితో ఈ కల్లోల ప్రపంచానికి కపోతాలమై శాంతి కిరణాలను అందజేస్తాము.
ఈ లోకం లో నీ విధులు ముగించుకొని మరో ప్రపంచానికి నీ వెలుగునివ్వటం కోసం వెళ్ళిపోయిన ఓ నల్ల సూరిడా నీకు ఇదే మా పాదాభివందనం.....
నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా.... 18 జూలై 1918 న జన్మించారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకమునుపు ఇతను జాతి వివక్ష వ్యతిరేఖ ఉద్యమ కారుడు మరియు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు "రోబెన్" అనే ద్వీపంలో జైలు శిక్షననుభవించాడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకడు. నల్లజాతి సూరీడు అని పలు తెలుగు వ్యాసాలలో ఈయనను గురించి వర్ణించారు. జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచాడు.
ఫిబ్రవరి 11, 1990లో జైలునుండి విడుదల అయిన తరువాత నెల్సన్ మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించడానికి, దేశంలో నెలకొన్న జాతి వైర్యాన్ని నివారించడానికి, అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశాడు. తన పూర్వపు ప్రతిస్పర్ధులనుండి కూడా ప్రశంసలు అందుకొన్నాడు. వందకు పైగా అవార్డులు, సత్కారాలతో వివిధ దేశాలు, సంస్థలు మండేలాను గౌరవించాయి. వాటిలో 1993లో లభించిన నోబెల్ శాంతి బహుమతి ముఖ్యమైనది. స్వదేశంలో మండేలాను మదిబా అని వారి తెగకు సంబంధించిన గౌరవసూచకంతో మన్నిస్తారు.
మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా పెక్కుమార్లు చెప్పాడు. భారత దేశం మండేలాను 1990 లో 'భారత రత్న', జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య బహుమతితో సత్కరించింది. భారత దేశం నుండి మండేలాకు ఎంతో సమర్ధన లభించింది. ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే కోట్ల మంది ప్రజలకు మండేలా ఒక ప్రతీకగా మారారు. పశ్చిమ దేశాలు కూడా హక్కుల ఉద్యమ కారులైన అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్‌కింగ్‌లతో సమానంగా ఆయన్ను గౌరవిస్తున్నాయి. హింసా మార్గంలో ప్రారంభించిన ఉద్యమాన్ని గాంధేయ మార్గంలోకి ఆయన మలచుకున్న తీరు ఆయనకు దక్షిణాఫ్రికా గాంధీగా పేరు తెచ్చింది. నోబెల్ శాంతి బహుమతితో అంతర్జాతీయ సమాజం ఆయన్ను గౌరవించుకోగా, 1990లో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చి భారతీయ సమాజం తనను తాను గౌరవించుకుంది.
మండేలా కుటుంబం "తెంబు" వంశానికి చెందినది. వీరు దక్షిణ ఆఫ్రికాలో "కేప్ ప్రాంతం"లో "ట్రాన్సకెయన్" బాగాలకు సాంప్రదాయికంగా పాలకులు. ఇతడు ఉమాటా జిల్లాలో మవెజో అనే వూరిలో18 జూలై 1918న జన్మించాడు. ఇతని తాతలకాలంలో వారు పాలించే తెంబూ తెగల ప్రాంతం బ్రిటిష్ వలస పాలకుల పరమయ్యింది. మండేలా తండ్రి "గాడ్లా" హక్కుల ప్రకారం పాలకుడు కాకపోయినా కొన్ని స్థానిక తెగలకు నాయకుడిగా గుర్తింపు కలిగి ఉండేవాడు. స్థానిక కౌన్సిల్‌లో సభ్యుడు. గాడ్లాకు నలుగురు భార్యలు. పదముగ్గురు పిల్లలు. వారిలో గాడ్లా 3వ భార్య "నోసెకెని ఫాన్నీ"కి జన్మించిన మగబిడ్డకు "రోలిహ్లాహ్లా" (అంటే కొమ్మలు లాగేవాడు -"దుడుకు స్వభావం కలవాడు" ) అని రు పెట్టారు. మండేలా బాల్యం తల్లి కుటుంబానికి చెందిన గూడెం ("ఉమ్జీ")లో అధికంగా గడచింది.
మండేలా స్వీయ చరిత్ర లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ 1994లో ప్రచురింపబడింది. అతను జైలులో ఉండగానే రహస్యంగా ఇది వ్రాయడం మొదలుపెట్టాడు. కాని అందులో మండేలా డి క్లర్క్ దురాగతాల గురించి గాని, కొన్ని హింసా కార్యక్రమాలలో తన భార్య విన్నీ మండేలా పాత్ర గురించి గాని ఏమీ వ్రాయలేదు. ఇవీ, మరికొన్ని వివాదాస్పద విషయాలు తరువాత మండేలా అనుమతి, సహకారాలతో ప్రచురింపబడిన మరొక జీవిత చరిత్రలో వ్రాయబడ్డాయి. 2013 డిసెంబర్ 5 న జోహెన్స్ బర్గ్ లో నెల్సన్ మండేలా అస్తమించారు.
హరి
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more