బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి.. తెలుగు చిత్రపరిశ్రమలో గర్వించదగని గొప్ప నటుడు. ఏ పాత్రలోనైనా పూర్తిగా లీనమైపోయి తన నటనాప్రతిభను కనబరిచిన ఈయన.. స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదించారు. ఆనాడు కథానాయికల్ని సైతం తన అభినయంతో గట్టిపోటీ ఇచ్చారంటే.. ఆ పాత్రధారణలో ఈయన ఎంతగా లీనజమైపోయి నటించారో అర్థం అవుతుంది. నిజానికి ఈయన తన నిజరూపం కంటే ఎక్కువగా తాను పోషించిన విభిన్న పాత్రలతోనే ఎక్కువ గుర్తింపు పొందారు.
జీవిత విశేషాలు :
1908 అక్టోబర్ 10వ తేదీన గుంటూరు జిల్లా, తెనాలిలో సుబ్రహ్మణ్యశాస్త్రి జన్మించారు. బాల్యం నుంచి నటన మీద ఆసక్తి ఎక్కువగా పెంచుకున్న ఈయన.. తన మేనమామ కోటేశ్వరరావు పర్యవేక్షణలో శాస్త్రి పద్యాలు, పాఠాలను పాడటం నేర్చుకున్నారు. అలాగే పాముల సత్యనారాయణ వద్ద పద్యాలు భావయుక్తంగా పాడటం, చిత్రకళలోని మెలకువలను తక్కువ సమయంలోనే నేర్చుకున్నారు. నటనలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించేంత స్థాయికి ఎదిగిపోయారు.
ఒక సందర్భంలో ఈయన నటనా విశిష్థతను గుర్తించిన బి.వి. నరసింహారావు... నాట్యశాస్త్రంలో సరికొత్త ప్రయోగరీతులన్నీ నేర్పించారు. బుర్రా నటనలో వున్న అనేక ప్రయోగాలను అభ్యసించారు. నాటకాల్లో ఈయనకున్న ప్రతిభను గుర్తించి.. ఆయన అన్న ప్రోత్సహించి.. ఉత్తమ స్త్రీ పాత్రధారిగా తీర్చిదిద్దారు. ఇక అక్కడినుంచి మొదలైన సుబ్రహ్మణ్యశాస్త్రి నటన ప్రస్థానం మొదలైంది. ఉత్తమ స్త్రీ పాత్రలైన సత్యభామ, చింతామణి, సక్కుబాయి, చంద్రమతి, మోహిని, మాధురి మొదలైన పాత్రలు ధరించి ‘ఔరా’ అనిపించుకున్నారు. ఆయనే సొంతంగా సత్యసాయిబాబా నాటక సమాజం స్థాపించి... నాటక ప్రదర్శనలిచ్చి రసజ్ఞులందరి ద్వారా ప్రశంసలు పొందారు. 1937లో సుబ్రహ్మణ్య శాస్త్రి చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. పోతన, స్వర్గసీమ, వేమన పెద్ద మనుషులు, త్యాగయ్య, నా యిల్లు, రామదాసు వంటి చిత్రాల్లో నటించి.. తన అధ్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
శాస్త్రి నటించిన స్త్రీ పాత్రలన్నింటిలోనూ ఓ సరికొత్త అనుభూతి కల్పించేది. పాత్రకు తగ్గట్టుగానే ఆయన సంభాషణ విధానం.. ఆ విధానానికి కావలసిన సాత్విక చలనం.. ఆ చలనంతో సమ్మిళితమైన నేత్రాభినయనమూ, సొంపూ, ఒంపూ, హొయలు, శృంగార రసాధిదేవతగా ప్రేక్షకుల్ని సంతోషపెట్టేలా నటించేవారు. ఈయన పాత్రాభినయానికి ముగ్ధులైన విశ్వనాధ సత్యనారాయణ ‘నాట్యాచార్య’గా.. ఆంధ్రప్రజానీకం ‘అభినయ సరస్వతి’గా.. కొండవీటి వెంకటకవి ‘నాట్యమయూరి’గా బిరుదులు ప్రసాదించారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more