The Biography Of Datla Venkata Narasaraju Who Is South Indian Film Director | Indian Film Industry | Telugu Directors

Datla venkata narasaraju biography south indian film director writer

Datla Venkata Narasaraju biography, dv narasaraju life story, dv narasaraju wikipedia, dv narasaraju history, telugu industry, telugu directors

Datla Venkata Narasaraju Biography South Indian Film Director Writer : The Biography Of Datla Venkata Narasaraju Who was a writer and director of South India films and playwright. He has written stories such as Gundamma Katha, Yamagola, and Donga Ramudu.

చిత్రపరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞశాలిగా పేరుగాంచిన రాజు

Posted: 08/28/2015 06:01 PM IST
Datla venkata narasaraju biography south indian film director writer

దాట్ల వెంకట నరజరాజు.. చిత్రపరిశ్రమలో కొన్ని ప్రముఖ విభాగాల్లో పూర్తి ప్రావీణ్యం కలిగిన ఆయన.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకున్నారు. ఓ రంగస్థల నటుడిగా తన కెరీర్ ప్రారంభించిన ఈయన.. ఆ తర్వాత రచయితగా చిత్రపరిశ్రమలో ప్రవేశించారు. కాలక్రమంలో నటుడిగా, ఆ తర్వాత దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. ఇలా తన టాలెంట్ ని ఇండస్ట్రీలో ఒక్కొక్క విభాగంలో ప్రదర్శించి.. బహుముఖ ప్రజ్ఞశాలిగా పేరుగాంచారు.

జీవిత విశేషాలు :

1920 జూలై 15న గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలంలోని తాళ్లూరులో నరసరాజు జన్మించారు. గుంటూరులోని హిందూ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, హిందూ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాసు లయోలా కళాశాల నుండి బి.ఏ పూర్తిచేశారు. విద్యనభ్యసించిన తర్వాత పత్రికల్లో కొంతకాలంపాటు పనిచేసిన ఈయన.. సినిమాల మీద వున్న మక్కువతో ఆ రంగంవైపు తన దృష్టి సారించారు. తొలుత మౌలిక నాటక రంగంలో పనిచేసిన ఆయన.. ఆ తర్వాతే పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

1951లో పాతాళభైరవి సినిమా వందరోజుల ఉత్సవం సందర్భంగా ప్రదర్శించబడిన నరసరాజు ‘నాటకం’ చూసి,, దర్శకుడు కె.వి.రెడ్డి ఈయన్ను సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆయన సహకారంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 1954లో ‘పెద్దమనుషులు’ సినిమాతో రచయితగా పరిచయం అయ్యారు. ఆ సినిమా విజయవంతం కావడంతో రచయితగా ఈయనకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. దీంతో ఆయన సినీరచయితగా స్థిరపడ్డారు. గుండమ్మ కథ, భక్త ప్రహ్లాద, యమగోల, రంగులరాట్నం, మనసు మమత, దొంగరాముడు వంటి 92కు పైగా సినిమాలకు కథను, మాటలను సమకూర్చారు. ఆయన రచించిన సినిమాలలో హాస్యరసం తొణికిసలాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించింది.

రచయితగా కొనసాగుతూనే ఈయన దర్శకత్వంవైపు ఆసక్తి కనబర్చారు. ఒకానొక సమయంలో ఈయనకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈయన తెరకెక్కించిన సినిమాల్లో ‘కారు దిద్దిన కాపురం’ ఒకటి. చెవిలో పువ్వు చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా పోషించారు. ఈయన చివరి సినిమా.. రాజ, భూమిక ప్రధాన పాత్రధారులుగా 2006లో విడుదలైన మాయాబజార్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Datla Venkata Narasaraju  Telugu Directors  

Other Articles