The Biography Of Varada Venkata Ratnam Who Built Ramarao Art School For His Friend | Indian Famous Illustrators | Indian Painters

Varada venkata ratnam biography famous illustrator built ramarao art school for his friend

Varada Venkata Ratnam biography, indian illustrator Varada Venkata Ratnam, indian painter Varada Venkata Ratnam, telugu updates, ramarao art gallery school, venkataratnam life history

Varada Venkata Ratnam Biography Famous Illustrator Built Ramarao Art School For His Friend : The Biography Of Varada Venkata Ratnam Who Built Ramarao Art School For His Friend.

స్నేహంకోసం ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించిన ప్రముఖ చిత్రకారుడు

Posted: 10/09/2015 06:51 PM IST
Varada venkata ratnam biography famous illustrator built ramarao art school for his friend

వరదా వెంకటరత్నం... చిత్రకళకు విశేష ప్రాచుర్యం కలిగించిన ప్రముఖ చిత్రకారులు. పేదవారికి ఆర్థిక సహాయం అందిస్తూనే.. చిత్రకళపై ఆసక్తి ఉన్నవారికి తన చిత్రశాలలో చేర్చుకుని చిత్ర రూపురేఖలో,వర్ణ ప్రయోగంలో చతురతలూ, కళామెళుకువలూ బోధిస్తూ ఉత్తమ శిష్యులను తయారుచేసిన మహా తపస్వి. అంతేకాదు.. నిజమైన స్నేహానికి మారుపేరుగా నిలిచిన గొప్ప స్నేహితుడు. తాను ఇబ్బందుల్లో వున్నప్పుడు తనకు ఎంతో సహాయం చేసిన స్నేహితుడి పేరు చిలకాలంగా నిలిచిపోవాలని.. ఆ స్నేహితుడి పేరు మీదే ఓ ఆర్ట్ గ్యాలరీనే ప్రారంభించారు.

జీవిత విశేషాలు :

1895 అక్టోబర్ 10వ తేదీన విశాఖపట్నం జిల్లా అలమండ గ్రామంలో సూర్యనారాయణ, అమ్మడు అనే దంపతులకు వెంకటరత్నం జన్మించారు. వెంకటరత్నం శ్రి వీరేశలింగం స్కూలులో మెట్రిక్ వరకు చదివి పాసయ్యారు. ఈయనకు చిన్నతనంలో దామెర్ల రామారావు సహచర్యం ఏర్పడింది. వారిరువురు బాల్యం నుండే చిత్రాలు గీస్తుండేవారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థిగా వున్న దామెర్ల వెంకట్రావుగారు తన తమ్ముడు రామారావు, వెంకటరత్నం ఇద్దరిని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కూల్డ్రేతో పరిచయం చేసారు. అప్పటి నుండి వీరిద్దరూ గీసిన చిత్రాలను కూల్డ్రే పరిశీలించేవారు. అనుకరణ చిత్రాలు వ్రాయవద్దనీ, ప్రత్యక్షంగా చూసిన చిత్రాలనే వ్రాయమని ఆలత సలహాలిచ్చేవారు. ఆయన ప్రోత్సాహం వారి చిత్రకళకు మెరుగులు దిద్దింది.

వ్యక్తిగత జీవితం :

ఆ రోజుల్లో వెంకటరత్నం ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు. ఈ కారణంగా ఆయన బొంబాయిలో చిత్రకళ నేర్చుకోవడానికి వెళ్లలేకపోయారు. కానీ.. ఆయన స్నేహితుడు రామారావు వెళ్ళారు. అనంతరం వెంకటరత్నంకు వీరేశలింగం కుమార్తె పాపాయమ్మతో వివాహం జరిగింది. 1920లో ప్రభుత్వ కళాశాలలో డ్రాయింగు టీచరుగా చేరారు. 1921లో రామారావు బొంబాయినుండి రాజమహేంద్రవరం వచ్చారు. అసహాయుడై, దుర్బలుడై, క్రుంగి క్రుశించిపోతున్న వెంకటరత్నంకు ఆయన అండగా ఉండి, చిత్రకళా వ్యాసంగం ప్రారంభించారు. వేకువజామునే ప్రకృతి దృశ్యాల ప్రతి కృతులు, ఇంటివద్ద రేఖావర్ణ చిత్రాలు, సాయంత్రం ప్రకృతి దృశ్యాల పరిశీలన చేస్తూ చిత్ర రచనను పెంపొందించుకున్నారు. రామారావు 1923లో ‘ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’ను ప్రారంభించారు. ఆ కాలంలో వెంకటరత్నం ఉబ్బసవ్యాధితో అస్పస్థులైనారు. ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు.

అయితే.. విధివైపరీత్యం కారణంగా రామారావు 1925 మార్చి 8వ తేదీన మరణించారు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన వెంకటరత్నం.. తన ఆర్థిక పరిస్థితి నుంచి కోలుకొని, రామారావు భార్య సత్యవాణిని చిత్రకళోన్నతులుగా చేసారు. తాను ఇబ్బందుల్లో వున్నప్పుడు తనకు ఎంతో సహాయం చేసి, ఉన్నత స్థానానికి తిరిగి తీసుకొచ్చిన మిత్రుడు రామారావు పేరును చిరస్థాయిగా ఉంచాలనే తలంపుతో ఆయన 1925లో ‘రామారావు ఆర్ట్ గ్యాలరీ’ని ఏర్పాటు చేసారు. ఇది రామమండ్రిలో కళాకేంద్రంగా విలసిల్లింది. రామారావు స్థాపించిన స్కూలు ‘రామారావు స్కూలు ఆఫ్ ఆర్ట్స్’ అనే పేరునే వెంకటరత్నం ప్రిన్సిపాల్ గా ఉంటూ.. సుమారు నాలుగు దశాబ్దాలుగా శ్రమిస్తూ వందలాది మంది శిష్యులకు గురువులుగా-విజ్ఞాన మహా మనీషిగా ఆదర్శజీవి అయినారు. నిజమైన స్నేహానికి ప్రతిరూపంగా నిలుస్తూ.. ఎందరో శిష్యులకు ఆదర్శ గురువుగా నిలిచిన ఈయన.. 1963లో మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varada Venkata Ratnam  ramarao art gallery  indian famous painters  

Other Articles