నెమలి పట్టాభి రామారావు.. ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈయన.. దేశ స్వాతంత్ర్యం కోసం తనవంతు పోరాటం చేశారు. స్వాతంత్ర్యంపై ప్రజల్లో చైతన్యం నింపి.. ఆ దిశగా అందరినీ పయనమయ్యేలా చేశారు. అంతేకాదు.. ఇటుకల పరిశ్రమను స్థాపించి వందలాది కార్మికులకు పని కల్పించారు. ప్రజాసేవలో చురుకుగా పాల్గొన్నారు. తన సొంత ఖర్చులతోనే గ్రామాలను పర్యటించి, సామాన్య ప్రజల ఉద్ధరణకు సలహాలు సూచిస్తుండేవారు. ప్రత్యేక ఆంద్రరాష్ట్రం ఏర్పాటుకు మద్దతు పలికారు.
జీవిత విశేషాలు :
1862లో కడప జిల్లా సిద్ధవటంలో ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో పట్టాభి రామారావు జన్మించారు. ఈయన కడప ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని, మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. 1882లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ డిగ్రీతో పట్టభద్రుడై మదనపల్లెలోని సబ్‌కలెక్టరు కార్యాలయంలో గుమాస్తాగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు. అక్కడ తన ప్రతిభను ప్రదర్శిస్తూ, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని చూరగొన్న ఈయన.. 1895లో అసిస్టెంట్ కమీషనర్ స్థాయికి చేరుకున్నారు. తదనంతరం డిప్యుటీ కమీనషరుగానూ పదవోన్నతి పొందారు. కొచ్చిన్ సంస్థానంలో రెవిన్యూ సెటిల్మెంట్ వ్యవస్థను సంస్కరించేందుకు.. ఆ విషయాలలో అనుభవమున్న పట్టాభి రామారావును ప్రభుత్వం కొచ్చిన్ సంస్థానానికి దీవాన్‌గా నియమించింది. 1902 నుండి 1907 వరకు దీవాన్ గా పనిచేసిన రామావు.. రెవిన్యూ సెటిల్మెంటును పూర్తిచేసి భూమి దస్తావేజులను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలను ప్రవేశపెట్టారు. 1908లో ఉద్యోగ జీవితం నుండి విరమించారు.
ప్రజాసేవలో రామారవు పాత్ర :
పట్టాభి రామారావు పదవీ విరమణ చేసిన తర్వాత మద్రాసులోని పూనమల్లి హై-రోడ్డుపై ‘శ్రీరామ బ్రిక్ వర్క్స్’ అనే ఇటుకల పరిశ్రమను స్థాపించి వందలాది కార్మికులకు పనికల్పించారు. తన సొంత వ్యాపార నిర్వహణతో పాటు ఆదోనిలోని వెస్ట్రన్ కాటన్ కంపెనీ, ఉన్నిదారం ఎగుమతిచేసే మద్రాసు యార్న్ కంపెనీల నిర్వహణలో పాల్పంచుకోనేవారు. తెలుగు అకాడమీ, భారతీయ అధికారుల సంఘం, కేంద్ర వ్యవసాయ కమిటీల కార్యదర్శిగా ప్రజాసేవలో చురుకుగా పాల్గొనేవారు. చివరకు మదనపల్లెలో స్థిరపడి సబ్ డివిజన్ సంఘానికి అధ్యక్షత వహించి, వాటి కార్యక్రమాలకు పూర్తి సమయాన్ని కేటాయించారు. సొంత ఖర్చులతో గ్రామాలను పర్యటించి, సామాన్య ప్రజల ఉద్ధరణకు సలహాలు సూచనలిచ్చారు. తొలుత ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఉత్సుకత చూపించకపోయినా, ఆ తర్వాత మనసు మార్చుకొని అందుకు మద్దతునిచ్చారు. ఈయన 1918లో కడపలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించారు. వృద్ధాప్యకారాణాలవల్ల 1937 అక్టోబరు 15న మద్రాసులో తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
స్వాతంత్ర్యోద్యమంలో పాత్ర :
ఆనాడు బ్రిటీష్ అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఆయా ఉద్యమాల్లో ఈయన కూడా పాల్గొన్నారు. స్వాతంత్ర్యంపై ప్రజల్లో చైతన్యం నింపి, ఆ దిశగా పావులు కదిపేలా కృషి చేశారు. తెల్లదొరలను భారతదేశం నుంచి తరిమి కొడితేనే తాము స్వాతంత్ర్యంగా జీవించగలమని, ప్రాణత్యాగానికైనా సిద్ధంగా వుండాలని, ప్రతిఒక్కరు స్వాతంత్ర్యం కోసం పోరాడాలంటూ పిలుపునిచ్చారు. ఈయన ప్రసంగానికి ఎంతోమంది ఉత్తేజితులై.. స్వాతంత్ర్య పోరాటాల్లో పాలుపంచుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more