బహుశా సినీ రంగంలో ఇంత సాహితీ అభిలాష యావ ఉన్న నటుడు మరోకరు ఉండరేమో! సాంప్రదాయాన్ని ఎవరైనా నిలబెడుతున్నారంటే చాలూ... ఎంత దూరమైన పయనించేందుకు సిద్ధమైపోతుంటాడు. నమస్తే అన్నా అంటూ ఈ తోట రాముడు... పరమశివుడినే ఏరా అంటూ ఏదో క్లోజ్ ఫ్రెండ్ ని సంభోధిస్తుంటాడు. అదేమంటే... గది గంతే అంటాడు. దొరబాబు, పాతసామాన్లోడు, నానాజీని, తోటరాముడు, మాణిక్యంగాడు, చేపలక్రిష్ణగాడు అంటూ 700 సినిమాలకు పైగా అలరించాడు.
ఇలాంటి వ్యక్తిని తెలుగు ప్రజానీకానికి అందించిన నటుడు రాళ్లపల్లికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకోవాలి. లేకుంటే సాహితి పిపాసి ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడేమో! ఓ కార్యక్రమంలో తెలుగు భాషకు మాత్రమే ప్రత్యేకమైన సాహితీ ప్రక్రియ పద్యం అని చెపుతూ, “పూతమెరంగులన్” పద్యమును భరణిగారు చదివిన తీరు పండితులను పామరులను సమానంగా ఆకట్టుకుంటుంది నటుడికన్నా ముందు ఒక మంచి రచయిత అయిన భరణి నటుడిగా బిజీ అయ్యాక మాట మాట్లాడితే కలం మడిచి జేబులో పెట్టేశానని అంటుంటారు కానీ ఆ కలానికి సాగటమే తప్ప ఆగటం తెలీదు. పద్యాలు అలవోకగా చెప్పే ఆయన కవితా ధార... మాటలతో ఆయన ఆడుకునే తీరు.. చూస్తే ఎవరైనా ఆయన వీరాభిమానిగా అయిపోవటం ఖాయం.
‘‘కదలిపోతోంది... భావన వదిలి పోతోంది.
వెళ్లలేక వెళ్లలేక ఒదిగిపోతోంది.
ఒదిగిపోయిన భావనలతో కవితలల్లాను.
కవితలన్నీ మనసులో కలమెట్టి రాశాను.
కవితలను రాసి రాసి అలసిపోయాను.
అలసిపోయిన నాకు చక్కని తలపు కలిగింది.
తలపులన్నీ వలపులై నన్ను బాధ పెట్టాయి.
బాధలో నా భావనలను చెదరగొట్టాను.
వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయాయి.
భావనలు వెళ్లిపోయాయి
నన్ను వదిలి వెళ్లిపోయాయి’’... అంటూ ఆశువుగా చెబుతుంటే వాహ్ వా... వాహ్ వా... అని నిజంగా అనొచ్చు.
నిషాని వాడిలా శివుడిని పూజిస్తూ ఆయన చెప్పిన పద్యాలు శభాష్ శంకరా. శివుడి లయలో ఈ ప్రపంచపు అన్ని కోణలని తాకతూ అభినవ భక్త కన్నప్పలా ఆయన వర్ణించిన తీరు సామాన్యుడికి సైతం అర్థమయ్యే భాషలో రచించిన తనికెళ్లకు సలాం కొట్టక ఉండలేం. వాటిలోని కొన్ని మచ్చుతునకలు మీకోసం....
సర్వం శివమయం జగత్ అనే శివ ఫిలాసఫీని సింపుల్ గా చెప్పగలిగిన ఏకైక సాహితివేత్త తనికెళ్ల భరణి. ‘చెంబుడు నీళ్లు పోస్తే ఖుష్... చిటికెడు బూడిద పోస్తే బస్... వట్టి పుణ్యానికి మోక్షమిస్తవు గదా శబ్బాష్రా శంకరా...’ అన్నాడు. బహుశా మరో కలం తెలంగాణా యాసలో ఇంత చక్కటి శివస్తుతిని పలికించగలిగేదా. అది వింటే శివుడు కూడా భరణి భుజంపై చేయి వేసి హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడేమో! ఆ ముక్కంటి ప్రియ భక్తుడైనందుకేమో.. ఈ భరణి కూడా వెరీమచ్ ఫ్రెండ్లీ. ఆయనకు తెలుగు విశేష్ ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more