Vidya balan to get married

vidya balan marriage, boyfriend siddharth roy kapur, bollywood wedding, movie the dirty picture, utv ceo, vidya affair

Actress Vidya Balan would be happy to get married to her boyfriend Siddharth Roy Kapur.

Vidya Balan to get married.GIF

Posted: 11/27/2011 04:21 PM IST
Vidya balan to get married

Vidya-balan

విద్యాబాలన్ హీరోయిన్ నటించిన ‘డర్టీపిక్చర్’ సిల్క్‌స్మిత పుట్టిన రోజున డిసెంబర్ 2న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలో విద్యా స్మిత పాత్రను పోషించగా, నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హస్మి, తుషార్ కపూర్ ఇతర పాత్రలను పోషించారు. మిలన్ లూథ్రియా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎక్తా కపూర్ నిర్మించారు.

తన సినిమా డర్టీ పిక్చర్ ప్రమోషన్లో భాగంగా దేశంలోని వివిధ నగరాల్లో పర్యటిస్తున్న విద్యా...ఇటీవల అహ్మదాబాద్‌ వచ్చింది. మీడియా ప్రతినిధులు సినిమా గురించి అడుగుతుండగా....సడెన్ గా తన పెళ్లి టాపిక్ తెచ్చింది విద్యా. ‘ నేను త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాను. నేను పెళ్లాడే వ్యక్తి ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అతగాడెవరో చెప్పాల్సిన సమయం ఇంకారాలేదు. ఆ సమయం రాగానే నేనే చెప్పేస్తాను’ అని వెల్లడించింది. విద్యా తనంతట తానే పెళ్లి గురించి చెప్పడంతో అంతా అవాక్కయ్యారు.

తనకు పెళ్లి చేసుకునే సమయం వచ్చిందని, ఆ కోరికను నామనసులో ఆపుకోలేక పోతున్నా....అందుకే మీకు చెబుతున్నాను అంటూ సంచలన ప్రకటన చేసింది బాలీవుడ్ హాట్ బేబ్ విద్యా బాలన్.
గత కొంత కాలంగా విద్యాబాలన్ యుటీవి మోషన్ పిక్చర్స్ ప్రతినిధి సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో రహస్యంగా ప్రేమాయణం సాగిస్తోందని, ‘డర్టీపిక్చర్’ విడుదల తర్వాత వీరిద్దరు తమ పెళ్లికి సంబంధించిన వార్తని అధికారికంగా వెల్లడించనున్నారని బాలీవుడ్ టాక్. సిద్ధార్థ్ రాయ్ కపూర్ గతంలో విద్యా నటించిన‘నో వన్‌కిల్డ్ జస్సిక’ చిత్రానికి నిర్మాత. ఆ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అంటుంటారంతా...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero siddartha second marraige1
Dhoni movie climax shoot at hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles