Mani ratnam signs lakshmi manchu

actress lakshmi manchu, filmmaker mani ratnam, lakshmi manchu tamil, filmmaker mani ratnam, director mani ratnam, lakshmi manchu pookadai

Lakshmi Manchu is going places. The multifaceted actress seems to be crossing all language barriers. After making her Bollywood debut in Department, now she has signed a prestigious Tamil movie to be directed by Mani Ratnam.

Mani Ratnam signs Lakshmi Manchu.GIF

Posted: 12/16/2011 05:41 PM IST
Mani ratnam signs lakshmi manchu

Manchu-laxmi

మంచు లక్ష్మి ప్రసన్న మెళ్లి మెళ్లిగా తన కెరియర్ కి పునాదులు వేసుకుంటుంది. ఇన్ని రోజులు మోహన్ బాబు కూతురుగానే ఉన్న మంచు లక్ష్మి సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుంది. ఈ మధ్య కాలంలో  అనగనగా ఓ ధీరుడు చిత్రంలో లేడీ విలన్‌గా విశ్వరూపం చూపించిన మంచు లక్ష్మిప్రసన్న విమర్శకుల ప్రశంసలు సాధించారు. ఓ వైపు అభిరుచిగల నిర్మాతగానూ తన సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో మనోజ్‌ హీరోగా ‘ఊ కొడతారా..ఉలిక్కిపడతారా’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా తానే ప్రధాన పాత్రలో ‘గుండెల్లో గోదారి’ అనే మరో చిత్రం నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం సంచలన దర్శకుడు మణిరత్నం తమిళంలో నిర్మించబోయే ఓ చిత్రంలో మంచు లక్ష్మి ఓ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. కీ.శే.కార్తీక్‌ కుమారుడు గౌతమ్‌ కథానాయకుడిగా అలనాటి గ్లామర్‌ క్వీన్‌ రాధ రెండవ కుమార్తె తులసి హీరోయిన్‌గా రూపొందించబోయే తమిళ చిత్రంలో మంచు లక్ష్మి ఓ ప్రధాన భూమిక పోషించనున్నారు. ఇంకా ఈ చిత్రంలో సోనమ్‌ కపూర్‌ను కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ చిత్రం టైటిల్‌ ‘పోకాడై’ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hrithik body gets an expensive touch
Hero sharwanand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles