Melody king ravi shankar sharma died

melody king ravi, shankar sharma died

melody king ravi shankar sharma died

10.gif

Posted: 03/08/2012 05:13 PM IST
Melody king ravi shankar sharma died

            bombay_ravi_inn ప్రముఖ సంగీత దర్శకుడు.. ‘మెలోడి కింగ్’ బిరుదాంకితుడు బాంబే రవి శంకర్ శర్మ రాత్రి ముంబైలో తుది శ్వాస విడిచారు. ఆయన అసలు పేరు రవి శంకర్ శర్మ. ఢిల్లీలో జన్మించిన ఆయన 1980, 90 దశకాలలో మెలోడి పాటలతో ఉర్రూతలూగించారు. హిందీలో 70, మలయాళంలో 14 సినిమాలకు రవి సంగీతం అందించారు.
           ఆయన తెలుగులో చేసిన ఏకైక సినిమా ‘సిరిగమలు’. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశాయి. అందులోని ‘స్వరరాగ గంగా ప్రవాహమే’ ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే. ఇంకా,  మలయాళంలో ఆయన చేసిన ‘వైశాలి’ సినిమాను తెలుగులోకి డబ్ చేశారు. అందులోని పాటలు కూడా శ్రోతల హ్రుదయాలను చూరగొన్నాయి.           

           కాగా, 1955 సంవత్సరంలో తొలిసారిగా అల్‌బేలి చిత్రంతో హింది చిత్రరంగానికి రవి పరిచయమయ్యారు. ఆతర్వాత వాంటెడ్, చౌదువీ కా చాంద్, దుల్హన్, గూంఘట్, గుమ్‌రాహ్, హమ్‌రాజ్, నీల్‌కమల్, పైసా యా ప్యార్, ఏక్ పూల్ దో మాలి, ఆజ్‌కీ అవాజ్ చిత్రాలతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దూసుకుపోయారు.
           1986 సంవత్సరంలో పంచాగ్ని చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి కాలుపెట్టారు. పంచాగ్ని చిత్ర ఘన విజయంతో రవి పేరు మలయాళ చిత్ర పరిశ్రమలో మారుమోగింది. రవి సంగీతానికి ఎక్కువగా సాహిత్యాన్ని ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఓఎన్‌వీ కురూప్ అందించారు. బాంబే రవి మృతిపట్ల భారత చిత్ర పరిశ్రమ తన సంతాపాన్ని వెలిబుచ్చింది. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hollywood movie tekken dubbing in telugu titled jems dookudu
Madhuri dikshit statue in london  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles