Film actor mohan babu acts as a rudraksha swami

film actor mohan, babu acts as a rudraksha swami

film actor mohan babu acts as a rudraksha swami

5.gif

Posted: 03/29/2012 02:47 PM IST
Film actor mohan babu acts as a rudraksha swami

            mohan_babu_innerఈ మధ్య వెండితెరకు దూరంగా ఉంటున్న విలక్షణ నటుడు మోహన్ బాబు  ఈసారి సరికొత్త వేషంలో దర్శనమివ్వబోతున్నారు. నుదుట నామం, తలపైనా, మెళ్లోనూ, రుద్రాక్షమాలలు, ఒంటిపై కాషాయ దుస్తులు. వెరసి రుద్రాక్షస్వామి అవతారంలో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారాయన. ప్రముఖ రచయిత జేకే భారవి దర్శకుడిగా మారి, రూపొందిస్తున్న 'జగద్గురు ఆదిశంకర' చిత్రంలో మోహన్ బాబు ఈ రుద్రాక్షస్వామి పాత్రను పోషిస్తున్నారు.
           గమ్మత్తుగా సాగే ఈ పాత్ర ఆయన మాత్రమే పోషించగల పాత్ర అని దర్శకుడు చెబుతున్నారు. ఈ పాత్రలో మోహన్ బాబు తనదైన శైలిలో చెప్పే సంభాషణలు ప్రేక్షకులను అలరిస్తాయని అన్నారు. ప్రపంచానికి అద్వైతాన్ని ప్రభోదించిన ఆదిశంకరుని జీవిత కథను భారవి, ఆబాలగోపాలానికి అర్ధమయ్యే రీతిలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆదిశంకరునిగా కౌశిక్ బాబు నటిస్తున్నారు. ఏ తరహా పాత్రలోనైనా ఇట్టే ఒదిగి పోయే మొహన్ బాబును స్వామి అవతారంలో చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raaja mouli eega movie audio release by seven heros
Cini heros and heroines are interested in journalism  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles