Director srinu vaitla doing very hard work for ntr forth coming movie badsha says rupa vaitla

director srinu vaitla doing very hard work for ntr forth coming movie badsha ..says rupa vaitla

director srinu vaitla doing very hard work for ntr forth coming movie badsha ..says rupa vaitla

12.gif

Posted: 04/13/2012 06:00 PM IST
Director srinu vaitla doing very hard work for ntr forth coming movie badsha says rupa vaitla

               Roopa_Vaitla_inn22మా ఆయన ‘బాద్షా’ సినిమాకోసం చాలా కష్టపడుతున్నారని సాక్షాత్తూ ఆ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల భార్య రూప వైట్ల తెలిపారు. ఆమె ఇచ్చిన ఒక ట్వీట్ లో ఈ విషయం వెల్లడించారు. ఇంత శ్రమ తానింతకు ముందెన్నడూ చూడలేదని కూడా రూప తెలిపారు. ఇదిలా ఉండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్-అందాల తార కాజల్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపు విదేశాల్లోనే జరగనుంది. ఇంతవరకూ ఎవరూ చేయని ప్రదేశాల్లో షూటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా యూనిట్ ముఖ్యులు ఇటలీ వెళ్లి వచ్చిన సంగతి మీకు వివరించాం. వీరు అక్కడి అందమైన, అరుదైన లోకేషన్స్ ని ఫైనలైజ్ చేసుకుని వచ్చారు కూడా.
              srinu_vaitla_innerఇటలీలోని పలు ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ మే 15 నుంచి మొదలై 50 రోజులపాటు ఏకధాటిగా  జరుగుతుందని అంటున్నారు. బండ్ల గణేష్ ఈ మూవీని భారీగా నిర్మిస్తోన్నారు. 'దూకుడు' సక్సెస్ తో శ్రీను వైట్ల,  'దమ్ము' చిత్రం పై అంచనాలు పెంచేస్తోన్న ఎన్టీఆర్,  'బిజినెస్ మేన్' హిట్ తో జోష్ మీదున్న కాజల్ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలోనే వున్నాయి. రచయితలు గోపి మోహన్, కోన వెంకట్ కూడా ఈ చిత్రానికి మంచి అవుట్ పుట్ ఇవ్వాలని శ్రమిస్తున్నారు.NTR_inn11223344 
            మరో సంచలన విషయమేమంటే..  'బాద్ షా' చిత్రంలో దివంగత ఎన్. టి. రామారావు నట విన్యాసాన్ని ప్రయోగాత్మకంగా ప్రేక్షకుల ముందుంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో రాజమౌళి - ఎన్టీఅర్ కాంబినేషన్లో వచ్చిన 'యమదొంగ' సినిమాలో, దివంగత రామారావుతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ చిందులు వేశాడు. ఇప్పుడదే టెక్నిక్ కి మరింత సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి 'బాద్ షా' ఆడియన్స్ ని అలరించేందుకు శ్రీను వైట్ల సిద్ధమౌతున్నాడు. ఈ టెక్నాలజీకి సంబంధించిన ఎపిసోడ్ వరకూ 10 కోట్లు ఖర్చు అవుతుందని వినికిడి. మొత్తంగా ఈ చిత్రంలో తాతామనువడిని కలసి చూసే అవకాశం మరోమారు రాబోతున్నందుకు సంతోషించాల్సిందే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress poonam kour opens a optical shop in hyderabad today
Tamanna rate rs60 lakhs for 10 days  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles