Young rebel star prabhas movie rebal climax shooting

young rebel star prabhas movie rebal climax shooting

young rebel star prabhas movie rebal climax shooting

28.gif

Posted: 04/25/2012 06:44 PM IST
Young rebel star prabhas movie rebal climax shooting

               reb1యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘రెబల్’ చిత్ర తాజా విశేషాలను ఆ చిత్ర దర్శక నిర్మాతలు ఇవాళ వెల్లడించారు. దీనికి సంబంధించి  నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావు మాట్లాడుతూ ఈ మూవీ క్లైమాక్స్‌ కోసం వేసిన భారీ సెట్‌లో చిత్రంలోని ప్రధాన తారాగణంతోపాటు 30 మంది రష్యన్‌ ఫైటర్స్‌ పాల్గొనగా ఫైట్‌మాస్టర్స్‌ రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో 20 రోజులపాటు భారీ ఎత్తున ఈ క్లైమాక్స్‌ను చిత్రీకరించడం జరిగింది. మే 1 నుంచి చివరి షెడ్యూల్‌ స్టార్ట్‌ అవుతుందని వెల్లడించారు. మే ఎండింగ్‌కి టోటల్‌గా చిత్రం షూటింగ్‌ పూర్తవుతుంది. జూలైలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వస్తోంది. ప్రభాస్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రభాస్‌ పెర్‌ఫార్మెన్స్‌, లారెన్స్‌ టేకింగ్‌ ఈ చిత్రానికి హైలైట్స్‌గా నిలుస్తాయి అని తెలిపారు.              
               reb2ప్రభాస్‌ సరసన తమన్నా, దీక్షాసేథ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ఈ చిత్రంలో  ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ప్రభ, ముఖేష్‌ రుషి, ప్రదీప్‌ రావత్‌, సుప్రీత్‌, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, కోవై సరళ, నలుగురు బాంబే విలన్స్‌ ముఖ్యతారాగణం.
                 మాస్‌, డాన్‌, కాంచన చిత్రాల రూపకర్త రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మిస్తున్నఈ భారీ చిత్రానికి మాటలు: 'డార్లింగ్‌' స్వామి, ఫొటోగ్రఫి: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, నిర్మాతలు: జె.భగవాన్‌, జె.పుల్లారావు, కథ- స్క్రీన్‌ప్లే - సంగీతం - కొరియోగ్రఫీ - దర్శకత్వం: రాఘవ లారెన్స్‌.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Charan upasana marriage date and time venue fixed
Comedy hero allari naresh new fantacy movie starts today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles