Young tiger badsha going italy for shooting

young tiger badsha going italy for shooting

young tiger badsha going italy for shooting

9.gif

Posted: 06/25/2012 04:39 PM IST
Young tiger badsha going italy for shooting

      ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న  బాద్ షా  చిత్రం కోసం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇటలీకి పయనమవుతున్నారు. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ఇటలీలో ప్రారంభం కానుంది.1e ఇటలీలో 25 రోజులు పాటు చిత్రీకరణ జరపుకోనున్న ఈ షెడ్యూల్లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తరవాత చిత్ర టీం ఇండియాకి వస్తారు.
      కాగా,  ఈ చిత్ర రెండవ షెడ్యూల్ బ్యాంకాక్ లో చేయనున్నారు, బ్యాంకాక్ లో జరిగే చిత్రీకరణలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించని విధంగా ఎన్.టి.ఆర్ కొత్త లుక్ తో కనిపించనున్నారన్న సమాచారాన్ని మీకింతకుముందే అందించాం.  ప్రముఖ ముంబై స్టైలిస్ట్ దగ్గర ఎన్.టి.ఆర్ కొత్త లుక్ ని డిజైన్ చేయించారు. శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని ఎంతో పర్సనల్ గా తీసుకొని  రూపొందిస్తున్నారని రూపావైట్ల గతంలో వెల్లడించిన సంగతి విధితమే. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prakash raj critical statement about bolywood media
An incident of legend actor sv rangarao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles