బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ నటించేందుకు తీసుకుంటున్న పారితోషకం ఎంతో తెలిస్తే వామ్మో అనిపించక మానదు. ఈ భామ అంతకంతకూ తన క్రేజీని పెంచుకుంటూనే వుంది. తాజాగా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సినిమాల్లోనే కాదు యాడ్ ప్రపంచంలోనూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ తాజాగా యాడ్ రెమ్యూనరేషన్ విషయంలోనూ రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా కత్రినా పేయింటింగ్ ప్రొడక్ట్ బెర్జర్ తో భారీ డీల్ కుదుర్చుకుంది. బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం సదరు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా కత్రినా వ్యవహరించినందుకు గాను ఏడాదికి ఏడు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోయిన్లలో బ్రాండ్ ఎండార్స్ మెంట్ల విషయంలో కరీనాకపూర్ టాప్ లో ఉంది. కరీనా గతంలో ఓ కోలా బ్రాండ్ తో 5 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. తాజాగా ఆ రేట్ ను బీట్ చేసింది కత్రినా కైఫ్. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో పాటు, సెక్సియెస్ట్ ఉమెన్ గా వరుసగా నాలుగోసారి నిలవడంతోనే కత్రినాకు సదరు కంపెనీ భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. రావడానికి కారణం ఆమెకు మే. ఇప్పటి వరకు కత్రినా చేతిలో 12 బ్రాండ్ ఎండార్స్ మెంట్లు ఉన్నాయి. ఈ విధంగా ఇటు సినిమాలతో అటు యాడ్లతో చేతి నిండా సంపాదిస్తోంది బ్యూటీ.
కాగా, సెక్సీయెస్ట్ హీరోయిన్ గా కత్రినా వరుసగా నాలుగవ సంవత్సరం కూడా ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు బాలీవుడ్ ఐటం స్టెప్పులేస్తూ కుర్రకారును ఉర్రూతలూపుతోంది. తాజాగా కత్రినా సల్మాన్ ఖాన్ తో కలిసి ‘ఏక్ థా టైగర్' చిత్రంలో నటించింది. ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more